నెంబర్ వన్ సోషల్ మీడియా సైకోగా మారిన వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు. పరారీలో ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. అరెస్టయిన తర్వాత ఆయన కూడా బయటకు రావడం లేదు. ఆయన అనుచరులు కూడా రావడం లేదు. అవినాష్ రెడ్డి పీఏ పరారీలో ఉన్నారు. ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తి భార్యను పిలిపించుకుని ధైర్యం చెప్పిన జగన్ .. తన పులివెందుల వాసి అయిన వర్రా రవీంద్రారెడ్డి కుటుంబసభ్యులను మాత్రం పిలిచి ఓదార్పు ఇవ్వలేదు.
వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టుల్లో అత్యంత జుగుప్సాకరమైనవి జగన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి, చెల్లెళ్లు షర్మిల,సునీతపైనే ఉన్నాయి. మనుషులు అనేవారు ఇలాంటి పోస్టులు పెట్టబోరని పోలీసులు చెబుతన్నారు. అంతర్గతంగా వర్రాకు సపోర్టుగా ఉన్నా బహిరంగంగా మాత్రం సపోర్టు చేసే అవకాశాలు కనిపించడం లేదు. జగన్ రెడ్డి తల్లి, చెల్లిపై పోస్టులు పెట్టిన ఆయనను సమర్థిస్తున్నారంటే ఇంత కంటే ఘోరమైన వ్యక్తులు ఉండరన్న ప్రచారం జరుగుతోందన్న ఉద్దేశంతో వర్రాకు పార్టీ పరమైన సపోర్టు పెద్దగా లేకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.
అయితే వర్రా ఆ పోస్టులు సహజంగా పెట్టరు. ఆయన కు అంత ధైర్యం లేదు. ఎందుకంటే వైఎస్ కుటుంబంపై పోస్టులు పెట్టేంత ధైర్యం ఆయనకు ఉండదు. జగన్ లేదా అవినాష్ రెడ్డి ఆదేశాలతోనే పెట్టి ఉంటారు.అయినా ఇప్పుడు ఆ వర్రాకు మద్దతుగా నిలిచేందుకు జనగ్ కానీ అవినాష్ రెడ్డి కానీ రెడీగా లేరు. ఎంత కాలం జైల్లో ఉంటారో కానీ.. ఇలా వాడుకుని బలి చేస్తారని వైసీపీ సోషల్ మీడియా కార్యకకర్తలు గుర్తిస్తారో లేదో మరి !