అంధ్రప్రదేశ్ లో భూముల ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ధరలు పెరగకపోగా తగ్గిపోయాయి. దీంతో ప్రజలు చాలా సంపద కోల్పోయారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్తిని ఆమ్ముకోవాలన్నా వేచి చూశారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారి ఆస్తులకు మళ్లీ కొత్త విలువలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలోనూ ఈ భూమ్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఒంగోలు టౌన్ చుట్టుపక్కల ఇళ్ల స్థలాలకు ఇప్పుడు గిరాకీ పెరిగింది.
అయితే ఒంగోలు రియల్ ఎస్టేట్ను పట్టి పీడిస్తున్న సమస్య అక్రమ లేఔట్లు. ఎకరం స్థలం తీసుకుని ఇష్టం వచ్చినట్లుగా ప్లాట్లుగా మార్చేయడం రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకుంటున్నారు. అలా కొనుగోలు చేసిన వారికి సమస్యలు వస్తున్నాయ్. చట్టబద్దంగా అన్ని అనుమతులు తీసుకున్న వెంచర్లరో కాస్త రేటు ఎక్కువ అయినా సమస్య ఉండదు. కానీ గతంలో వైసీపీ నేతలు తామే అధికారంలో ఉన్నామని ఎలాంటి సమస్యలు రావని చాలా మందికి అనుమతుల్లేని ప్లాట్లు అంటగట్టి మోసం చేశారు. అలాగే కబ్జాలు కూడా పెద్ద సమస్యగా మారాయి. వాటన్నింటికీ ప్రస్తుతం పరిష్కారం లభిస్తోంది.
ఒంగోలు నగరం అనుకున్నంతగా విస్తరించడం లేదు. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నా.. కాలనీలు విస్తరించడానికి సమయం పడుతోంది. అమరావతి రాజధాని కూడా కలసి వస్తోంది. అమరావతికి ఒంగోలు కాస్త దగ్గరగా ఉండటంతో పాటు గంటన్నరలో చేరుకునేలా మంచి హైవే కూడా ఉండటంతో క్రమంగా పెట్టుబడులు పెట్టే వారు పెరుగుతున్నారు. అమరావతి పనులు ఊపందుకున్న కొద్దీ ఒంగోలు ప్రజల ఆస్తుల విలువ కూడా అనూహ్యంగా పెరగనుంది. రియల్ ఎస్టేట్లో కొత్త కొత్త పెట్టుబడులు రానున్నాయి.