వర్రా రవీంద్రారెడ్డిని కూడా మా వాడే అంటున్నారు కానీ శ్రీరెడ్డితో మాత్రం మాకు సంబంధం లేదంటున్నారు వైసీపీ నేతలు. ఆమె గురువారం రాసిన రెండు లేఖలు వైసీపీ పరువు తీసినట్లుగా ఉన్నాయని భావించిన హైకమాండ్ వెంటనే గుడివాడ అమర్నాథ్తో ప్రెస్ మీట్ పెట్టించింది.ఇతర విషయాలు మాట్లాడినప్పటికీ ఆయన శ్రీరెడ్డి విషయంలోనే క్లారిటీ ఇచ్చారు. శ్రీరెడ్డి ఎవరో తమకు తెలియదని ఆమెకు వైసీపీతో సంబంధం లేదన్నారు. గుడివాడ అమర్నాథ మాటలు విన్న వారంతా ఆశ్చర్యపోయారు.
శ్రీరెడ్డి ఎన్నికలకు ముందు వైసీపీ కోసం చేసిన పని చిన్నది కాదు. ఒళ్లు దాచుకోకుండా కష్టపడటం అంటారే అలా కష్టపడింది. వైసీపీ బ్రాండ్ ఏ మాత్రం తగ్గకుండా బూతులు మాట్లాడింది. డైలాగులు చెప్పింది. ఊచకోతలు కోస్తామని హెచ్చరికలు జారీ చేసింది. వీటన్నింటినీ వైసీపీ నేతలు గొప్పగా షేర్ చేసుకున్నారు. భలే చెప్పిందే అనుకున్నారు. మధ్యలో ఓ సారి పేమెంట్ లేట్ అయితే నేరుగా వీడియో ద్వారా అడిగితే అప్పటికప్పుడు సజ్జల భార్గవ టీం డ్యూస్ క్లియర్ చేసి.. ఆ వీడియో డిలీట్ కూడా చేయించారు.
ఇప్పుడు కేసులు పడతాయన్న భయంతో ఆమె తనను కాపాడాలని వేడుకుంటూంటే.. పట్టించుకున్న వారు లేరు. దీంతో వరుసగా కేసులు నమోదవుతూండటంతో ఎక్కడ లోపలుకు పంపిస్తారో అన్న భయంతో లోకేష్ ను అడుక్కుటూ ఓ లేఖ రాసింది. ఇక వైసీపీకి దూరమని మరో లేఖ రాసింది. ఈ లేఖలు చూసి పాపం వైసీపీ అనుకున్నారు అందరూ. తమ పరువును మరోసారి తీసిందని అనుకున్న హైకమాండ్ .. శ్రీరెడ్డి ఎవరో తమకు తెలియదని తేల్చేసింది.