మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈ నెల ఇరవయ్యో తేదీన పోలింగ్ జరగనుంది. పద్దెనిమిదో తేదీన సాయంత్రం ప్రచార గడువు ముగుస్తుంది. అందుకే బీజేపీ కూడా తమ ఎన్డీఏ అగ్రనేతల్ని ప్రచార బరిలోకి దించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యులు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు.
చంద్రబాబు శని, ఆదివారాల షెడ్యూల్ పూర్తిగా మహారాష్ట్రలోనే ఉంది. ముంబైలో పలు చోట్ల రోడ్ షోలు, సభల్లో చంద్రబాబు ప్రసంగిస్తారు. ముంబైలో తెలుగు వారు కూడా పెద్ద ఎత్తున ఉంటారు. అలాగే చంద్రబాబుకు జాతీయస్థాయి ఇమేజ్ ఉంది. ఆయన. ప్రచారం బాగా ఉపయోగపడుతుందని మహారాష్ట్ర బీజేపీ నమ్మకంతో ఉంది. వారి విజ్ఞప్తిని చంద్రబాబు అంగరీంచి రెండుపూర్తి రోజులు వారికి కేటాయించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు మూలాలు ఉన్న ప్రజలు అధికంగా ఉన్న. ప్రాంతాల్లో రెండు రోజుల పాటు పర్యటిస్తారు.ఆయన షెడ్యూల్ కూడా ఖరారు అయింది.
ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న రేవంత్ గడ్డి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇప్పటికే ముంబైలో ఓ రోజు రోడ్ షో నిర్వహించారు.మరో రెండు రోజులు ప్రచారం చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలంతా ఇలా జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్లు కావడం ఆశ్చర్యకరమే అనుకోవచ్చు.