విజయనగరం జిల్లాలో పని చేసిన ఓ ఐఎఎస్ అధికారిని తన గుప్పిట్లో పెట్టుకున్న బొత్స వందల కోట్ల విలువైన భూముల్ని కాజేశారు. బినామీల పేరుతో అడ్డగోలుగా రాయించేసుకున్నారు. చీప్‌గా పదవి పోయే ముందు ఉపాధ్యాయుల బదిలీలలకూ పెద్ద ఎత్తున వసూలు చేసిన ఆయన లీలలు.. అన్నీ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓ జనవరి ఫస్ట్ రోజు బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కిన ఐఏఎస్ అధికారి గురించి వైరల్ అయింది. ఆ ఐఏఎస్ అధికారి పేరు కిషోర్ కుమార్. జాయింట్ కలెక్టర్ గా విజయనగరం వచ్చారు.కొన్నాళ్లు ఇంచార్జ్ కలెక్టర్ గా చేశారు. ఆయన బొత్స కాళ్లు ఎందుకు మొక్కారో కానీ ఆయన చెప్పినట్లుగా చేసి.. అడ్డగోలుగా భూములన్నీ బొత్స బినామీల పరంగా చేశారు. వాటి లెక్క ఇప్పుడు తేలుతోంది. పలు చోట్ల ఎకరాలకు ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు రాసిచ్చేశారు. వీటి విలువ రూ.350 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
ఇలా భూములు కట్టబెడితే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని తాము ఎవరం సంతకాలు చేయబోమని ప్రాసెస్‌లో పాల్గొనాల్సిన రెవిన్యూ ఉద్యోగులు తేల్చేయడంతో మొత్తం పనులను కిషోర్ కుమారే పూర్తి చేశారని ప్రభుత్వానికి నివేదిక అందింది. తాను జేసీగా సిఫారసు చేసిన వాటిని కలెక్టర్ పక్కన పెట్టడంతో.. ఆయన బదిలీ అయ్యాక..ఇంచార్జి కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చాక… తన సిఫారసుల్ని తానే ఆమోదించేశారు కిషోర్ కుమార్.
వైసీపీ హయాంలో విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ కనుసన్నలనుదాటి ఒక్క గజం కూడా లావాదేవీలు జరగవు. ప్రభుత్వ భూముల్లో అయితే చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు సాక్ష్యాలతో సహా ప్రభుత్వం వద్ద రికార్డులు ఉన్నాయి. ఐఏఎస్‌ను సస్పెండ్ చేసి.. మొత్తం భూదందా లబ్దిదారులెవరో తేల్చనున్నారు. అంతిమ లబ్దిదారు బొత్సనే.. విజయనగరంలో అందరికీ తెలుసు. మరి విచారణలో ఏం తేలుతుందో ?