ఉత్తరాంధ్రలో మరో అతి పెద్ద ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. విశాఖ తిక్కవాని పాలెం లోని ఎన్ టి పి సి లో కీలక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని పెట్టుబడి విలువ రూ. 84 వేల కోట్లపైమాటే. ఈ 29న ఎన్ టి పి సి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ భూమి పూజ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందులో స్వయంగా పాల్గొంటారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత ప్రధాని తొలి సారిగా విశాఖ వస్తున్నారు.
NTPC, AP GENCOల ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం కాబోతుంది. మూడు దశల్లో రాబోతున్న ప్రాజెక్ట్‌కు 84,700 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. ప్రధాని మోదీప పర్యటన సందర్భంగా కీలక ప్రకటనలు టేసే అవకాశం ఉంది. విశాఖ మెట్రోతో పాటు ఇతర అంశాలపై కూడా ప్రకటన చేయించే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోదీ మొదటి సారి విశాఖ వస్తున్నారు. ఖచ్చితంగా కొన్ని వరాలుంటాయని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు. విశాఖకు కావాల్సి న ప్రాజెక్టుల విషయంలో ఆయనకు స్పష్టత ఉంది.
విశాఖను ఆర్థిక రాజధానిగా చేయడానికి అవసరమైన సాయాన్ని కేంద్రం నుంచి పొందడానికి ఏ మాత్రం మొహమాటపడే పరిస్థితి ఉండదు. అందుకే వచ్చే ఐదేళ్లలో విశాఖ స్వరూపం మారిపోతుందని ప్రజలు కూడా గట్టిగా నమ్ముతున్నారు.