హోమ్లోన్ల విషయంలో అనేక మంది చాలా అనుమానాలు ఉంటాయి. అంత పెద్ద మొత్తంలోనే తీసుకుంటున్నప్పుడు ఎలాగైనా వీలైనంత త్వరగా తీర్చేయాలని అనుకుంటారు. పైగా లోన్ తీసుకుని కట్టుకున్న ఇల్లు తమ సొంతమని కూడా గట్టిగా అనుకోలేరు. అందుకే వీలైనంత త్వరగా హోమ్ లోన్ తీర్చేయాలని అనుకుంటూ ఉంటారు.అయితే అలా తీర్చేయడం మంచిది కాదని కొంత మంది గట్టి నమ్మకం. టాక్స్ బెనిఫిట్స్ పోతాయని.. ఇంకా చార్జీలు ఆడుతాయని అనుకుంటారు.
హోమ్ లోన్ ను డబ్బులు ఉన్నప్పటికీ తీర్చకపోవడం మంచిదని అనుకుంటూ ఉంటారు. నిజానికి కొంత మంది విషయంలో ఇది కరెక్టే అయినా మారుతున్న యువత ఆలోచనల్లో అసలు ఇలాంటి దీర్ఘకాలిక రుణాలను ఉంచుకోవడంపై విరక్తి చెందుతున్నారు. అందుకే సంపాదించినది మొత్తం హోమ్ లోన్స్ తీర్చేసి. ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు. దీనికి కారణం టాక్స్ బెనిఫిట్స్ పై పెద్దగా ప్రయోజనం లేకపోవడమే. ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీ, అమలుపై టాక్స్ బెనిఫిట్స్.. హౌస్ రెంట్ కు పెద్దగా తేడా ఉండటం లేదు. పైగా అవన్నీ పెట్టుకున్నా ఇతర టాక్స్ ఎగ్జంప్షన్ ఆప్షన్స్ ఉండనే ఉన్నాయి. అందుకే వెసులుబాటు ఉన్న వాళ్లంతా హోమ్ లోన్స్ తీర్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాస్త టాక్స్ కట్టే పరిస్థితి వచ్చినా తగ్గడం లేదు.
కరోనా తర్వాత హోమ్ లోన్లపై యువత చూసే దృష్టి మారింది. వాటిని బర్డెన్లుగా భావిస్తున్నారు. వీలైనంత తీర్చేసుకుంటే సమస్యగా ఉండదని అనుకుంటున్నారు. ముఖ్యంగా పదేళ్ల కిందట తీసుకున్న రుణాల చెల్లింపులు ఇటీవలి కాలంలో ఎక్కువ అయ్యాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అంతే భారీగా హోమ్ లోన్స్ తీసుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. తక్కువ మొత్తాలతో చెల్లింపులు చేసేసి.. ఎక్కువ మొత్తాలతో ఇల్లు కొనేవారు కూడా ఉంటున్నారు.
ప్రస్తుత ప్రకారం చూస్తే.. హోమ్ లోన్స్ తీర్చేసినా ఆర్థిక పరంగా ఎలాంటి ప్రయోజనాలు కోల్పోరు. పన్నుల కోతను మరో విధంగా సర్దుబాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దానికి మొగ్గు చూపేవారు ఎక్కువగానే ఉన్నారు.