ఎన్డీఏ కూటమికి మద్దతుగా పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారు. శని, ఆదివారాలు ఆయన ప్రచార షెడ్యూల్ ఖరారు చేశారు. శనివారం మూడు సభల్లో పాల్గొన్నారు. ప్రతి చోటా పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఎన్నికల సమయంలో జన సమీకరణ చేస్తారు కానీ.. పవన్ కల్యాణ్ వస్తున్నారు అంటే.. ఆ బాధ్యత చాలా వరకూ తగ్గిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మహారాష్ట్రలో కూడా వర్తిస్తుంది. ఊరి పేర్లు కూడా ఎప్పుడూ వినని ప్రాంతాల్లో జరిగిన బహిరంగసభలకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
పవన్ కల్యాణ్ అక్కడి ప్రజల్ని ఆకట్టుకునేలా ప్రసంగాలు చేశారు. మరోసారి బీజేపీ కూటమికే అవకాశం ఇవ్వలన్నారు. తన ప్రసంగాల్లో హిందూత్వ వాదానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఓవైసీ ఎప్పుడో చేసిన ఓ హెచ్చరికను బయటకు తెచ్చి వార్నింగ్ ఇచ్చారు. హిందువులు కలసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. పవర్ ప్రచార శైలి బీజేపీ నేతలు కోరుకున్నట్లుగా ఉంది.
పవన్ కల్యాణ్ ప్రచార షెడ్యూల్ ఉన్న మరఠ్వాడా, నాందేడ్, నాసిక్ ప్రాంతాల్లో ఎన్నికల ఇంచార్జులుగా బీజేపీ నాయకత్వం ఏపీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, మధుకర్, మాధవ్‌లకు చాన్సిచ్చింది. అక్కడతెలుగు మూలాలున్న ప్రజలు ఎక్కువగా ఉంటారు. వారందర్నీ ఆకట్టుకోవడానికి పవన్ కల్యాణ్ ప్రచారం ప్లాన్ చేసుకున్నారు. ఎంత వర్కవుట్లు అవుతుందో కానీ.. పవన్ కు మహారాష్ట్రలో ఉన్న క్రేజ్ మాత్రం అందరికీ తెలిసేలా చేసింది.