అమెరికన్లకు నరకం అంటే ఏంటో చూపిస్తామన్నట్లుగా ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తాజాగా రామస్వామి ఓ సమావేశంలో విచిత్రమైన ప్రకటన చేశారు. అదేమిటంటే.. ప్రభుత్వ ఉద్యోగులందర్నీ తీసి పడేస్తారట. ట్రంప్ తెచ్చింది ఉలి కాదు రంపం అని గొప్పగా ప్రకటించారు. ఉలితో అయితే అమెరికాను చెక్కవచ్చు.. రంపంతో అయితే కోసి పడేయవచ్చు. ఏది బెటర్ అని ఆలోచిస్తే ఆయనకే తెలుస్తుంది.కానీ ఆయన ఉద్దేశం మాత్రం.. ఉద్యోగుల్ని తీసి పడేయడమే.
డైరక్టర్ అప్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ అనే ఓ పదవిని సృష్టించి దానికి ఇద్దరిని ఇంచార్జులుగా పెట్టారు ట్రంప్. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి. వీరేమి చేస్తారంటే.. డబ్బులు ఆదా చేస్తారు. అందుకే వీరు ఒక్క డాలర్ కూడా జీతం తీసుకోరు. అలాగే జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని నిరుద్యోగుల్ని చేయడానికి రెడీఅయిపోయారు.
డోజ్‌లో పని చేయడానికి ఉద్యోగులు కావాలి అని మస్క్ ఓ ప్రకటన చేశారు. లైఫ్ లో ఇంకేమీ లేదన్నట్లుగా పని చేయాలని ఆయన చెప్పుకొచ్చారు. కానీ జీతం మాత్రం పైసా ఇవ్వరట. ఇలాంటి విచిత్రమైన ప్రకటనలతో ట్రంప్ పాలనలో నరకం అంటే ఏమిటో చూపిస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెలలో వైట్ హౌస్ లోకి వెళ్లనున్న ట్రంప్.. మొదట్లోనే అందర్నీ భయపెడుతున్నారు. నిజంగానే నాలుగేళ్లలో నరకం అంటే ఏమిటో.. అమెరికన్లకు తెలిసేలా చేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు.