తల్లి, చెల్లి కి ఆస్తులు పంచకుండా వారు ఎదురు తిరిగారని తప్పుడు పోస్టులు పెట్టించి మానసికంగా వేధించే జగన్ రెడ్డి , ఆయన సాక్షి ఇతరుల కుటుంబాల విషయంలో కాస్త అయినా విజ్ఞత చూపుతారని ఎవరూ అనుకోలేరు. జగన్ రెడ్డి మనస్థత్వానికి తగ్గ జర్నలిస్టుల్నే పెంచి పోషిస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. చంద్రబాబునాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు చనిపోయారు. ఆయన మృతదేహంపై రాజకీయ పేలాలు ఏరుకునేందుకు సాక్షి ఏ మాత్రం ఆలోచించడం లేదు.
రామ్మూర్తి నాయుడు కూడాచంద్రబాబు బాధితుడే అంటూ ఓ కథనం రాసి పడేశారు. రాజకీయంగా ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదని మరొకటని చెప్పుకొచ్చారు. రామ్మూర్తి నాయుడుకు టిక్కెట్ ఇవ్వడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారన్నారు. ఆయన చంద్రగిరి నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత అన్నతో విబేధించారు. అయినా చంద్రబాబు ఎప్పుడూ ఆయనపై వద్వేషం పెంచుకోలేదు. ఆయన ఆరోగ్యం బాగోలేదని దానిపై దృష్టి పెట్టాలని కుటుంబసభ్యులతో చెప్పించారు.కానీ ఆయన వినకపోవడం వల్ల సమస్యలు పెరిగిపోయాయని ఆ కుటుంబానికి తెలుసు.
అయినా గతంలో రామ్మూర్తి నాయుడు అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేశారు. అప్పట్లో నారా రోహిత్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడంతో తగ్గారు. ఇలా అంటున్న వారే నారా రోహిత్ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే సినిమాలు తీస్తూంటారని.. ఆరోపిస్తూంటారు. ఏది అవసరం అనుకుంటే అలా కుటుంబ విషయాల్లో ఆరోపణలు చేయడం వైసీపీ నేతలకు అలవాటు.
జగన్ రెడ్డి తన రాజకీయాల కోసం ఎన్ని కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారో.. అందుకు సాక్షి ఎలా టూల్గా ఉపయోగపడిందో అందరికీ తెలుసు. ఆ పాపమే ఇప్పుడు ఆయనను చుట్టుముట్టిందని నమ్మేవారు కూడా ఎక్కువే ఉన్నారు.