రామోజీరావు మనవళ్లు, మనవరాళ్లు ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి కొత్త ఆలోచనలతో ప్రయత్నాలు ప్రారంభించారు. పెద్దకుమారుడు కిరణ్ కుమార్తె సారి కొత్తగా మిల్లెట్స్ బ్రాండ్ ప్రారంభించారు. రామోజీరావు జన్మదినం రోజున ఈ బ్రాండ్ ను లాంచ్ చేశారు. సబల పేరుతో ఈ బ్రాండ్ మిల్లెట్స్ చాలా విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేసిన తర్వాతే లాంచ్ చేశారు. ప్రియా బ్రాండ్ కింద ఈ సబల బ్రాండ్ కూడా ఉంటుంది. సొంతంగా ఆర్ అండ్ డీ పెట్టుకోవడం ఈ వ్యాపారంలో అంత సులువైన పని కాదు. కానీ భారీగా ఖర్చు పెట్టి క్వాలిటీ విషయంలో తగ్గకుండా ఉండేందుకు .. రామోజీ గ్రూప్ బ్రాండ్ ఎలా ఉంటుందో ఆ స్థాయిలో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రామోజీ రావు ఎన్నో వ్యాపారాలు చేశారు. ఆయన పట్టినదంతా బంగారం అని అనుకుంటారు కానీ కొన్నింటిలో ఆయన ఫెయిల్అయ్యారు. అయితే వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మరో వ్యాపారంలో విజయం సాధించారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం రామోజీరావు కుమారులకు రాలేదు. రామోజీ ప్రారంభించిన వాటిని చూసుకోవడంతోనే వారికి సరిపోయింది. ఇప్పుడు కొత్త తరం..తమ ఆలోచనలకు తగ్గట్లుగా కొత్త వ్యాపారాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
రామోజీరావు ఉన్నప్పుడే మనవరాళ్లకు వారికి ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహించారు. మీడియా విషయంలో మరో మనవరాలు బృహతికి స్వయంగా శిక్షణ ఇచ్చారు. డిజిట్ మీడియాను ఆమెనే నడిపిస్తున్నారు. ఇతర రంగాల్లోనూ మనవరాళ్లు అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రామోజీ నిలబెట్టిన సంస్థలను ముందుకు తీసుకెళ్లడం కాకుండా కొత్త బ్రాండ్లను రిలీజ్ చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.