‘పుష్ప’ ఫీవర్ దేశమంతా పాకేసింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా బజ్ అయితే ఆకాశానికి తాకింది. ఇప్పుడు పుష్ష ట్రైలర్ వచ్చేసింది. 2 నిమిషాల 48 సెకన్ల ఈ ట్రైలర్… ఒక్కమాటలో చెప్పాలంటే అరాచకానికి కేరాఫ్ అడ్రస్స్లా మారింది. ప్రతీ ఫ్రేమ్… భారీగానే ఉంది. ప్రతీ డైలాగ్.. అభిమానులు ఊగిపోయేలా ఉంది. బన్నీ స్టైలింగ్, క్యారెక్టర్ లో తాను చూపించే ఆటిట్యూడ్, ఆ గ్రాండియర్… ఇవన్నీ పుష్ష స్థాయిని మరింత పెంచేశాయి.
”డబ్బంటే లెక్కలేదు.. పవర్ అంటే భయం లేదు. ఈన్లో తెలియని బాధ ఉంది”
”నామ్ ఛోటాహూ.. లేకిన్ సౌండ్ బహుత్ బడాహై”
”శ్రీవల్లీ నా పెళ్లాం. పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటాదో ప్రపంచకానికి చూపిస్తా”
”నాకు రావాల్సింది పైసా అయినా అర్థణా అయినా, అది ఏడు కొండల పైనున్నా, ఏడు సముద్రాల అవతల ఉన్నా, వెళ్లి తెచ్చుకోవడమే పుష్షగాడికి అలవాటు”
”పుష్ష అంటే నేషనల్ అనుకొంటివా.. ఇంటర్నేషనల్”
”పుష్ష అంటే ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్”
ఇలా అడుగుకో ఎలివేషన్, ఫ్రేమ్ కో.. పూనకం.. మొత్తానికి పుష్ప 2 ట్రైలర్ అంచనాలను అందుకొనేలానే తీర్చిదిద్దాడు సుకుమార్. ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ట్రైలర్ లోనూ ఆ షాట్స్ బాగానే చూపించారు. భార్యాభర్తల ఎమోషన్‌కి ఈ సినిమాలో పెద్ద పీట వేశారు. ఓ షాట్ లో… రష్మిక కాలితో.. పుష్ప ‘తగ్గేదే’ లే అంటూ సిగ్నేచర్ స్టైల్ కాపీ చేయడం.. ట్రైలర్‌కే హైలెట్ గా నిలుస్తుంది. పుష్ప పార్ట్ 1లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర చివర్లో వచ్చింది. ఈ సినిమాలో అయితే.. తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. అది ట్రైలర్‌తోనే అర్థం అవుతోంది. మైత్రీ మూవీస్ నిర్మాణ విలువలు, వారి భారీదనం అడుగడుగునా కనిపిస్తున్నాయి. డిసెంబరు 5న సినిమా విడుదల అవుతోంది. అప్పటి వరకూ… ఈ ట్రైలర్‌తోనే కడుపు నింపేసుకోవొచ్చు ఫ్యాన్స్.