ఏపీ రాజకీయాల్లో కొత్త పంచాయతీ ప్రారంభమయింది. అది ఆర్కే వర్సెస్ విజయసాయిరెడ్డి. ఏబీఎన్ లో తనపై ఏదో స్టోరీ రాశానని విజయసాయిరెడ్డి ఫీలైపోయి ఆర్కేపై చాలా పెద్ద కథ సోషల్ మీడియాలో రాశారు. దానికి ఆర్కే తన వీకెండ్ కామెంట్ లో విజయసాయిరెడ్డికి సవాల్ చేశారు. అలా ఇలా కాదు.. ఆయనను ఓ వేశ్యలా సంబోధించడమే కాదు.. తనను తరచూ కలుస్తారని చెప్పారు. ఏ కారణాలతో కలుస్తారో మాత్రం చెప్పడం అనైతికం కాబట్టి చెప్పబోనన్నారు. నిజానికి అది అనైతికమో కాదో కానీ వైసీపీపై అనుమానాలు పెరిగిపోవడానికి కారణంగా మారుతుంది.
విజయసాయిరెడ్డిపై జగన్ రెడ్డికి గతంలోనూ అనుమానం ఉంది. ఆయనను దూరం పెట్టారు.పార్టీ ఓడిపోయాం పిలిచి మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆయనను తప్పించేందుకు అవసరమైన స్టఫ్ ను ఆర్కే ఇచ్చారు.దానికి కారణం తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడమే. ఇప్పుడు విజయసాయిరెడ్డి సైలెంటుగా ఉంటే ఆయన తన తప్పును అంగీకరించినట్లే అవుతుంది. అందుకే ఆయనసైలెంట్ గా ఉండే అవకాశం లేదు.
శనివారం సాయంత్రం ఆర్కే తన టీవీ చానల్ లో విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆదివారం పత్రికలోనూ వచ్చింది. కానీ విజయసాయిరెడ్డి స్పందించలేదు. బాగా సమయం తీసుకుంటున్నారేమో కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇస్తారని అంటున్నారు. రివర్స్ ఆరోపణలు ఎన్ని చేసినా చివరికి ఆర్కే చేసిన సవాల్.. ఓపెన్ డిబేట్కు అంగీకరించకపోతే.. విజయసాయిరెడ్డిని సమర్థించేవారు తక్కువగా ఉంటారు. మరి విజయసాయిరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో ?. అసలు ప్రెస్మీట్ ఎప్పుడు పెడతారో ?