ఏపీ ప్రభుత్వం టెక్నాలజీని గరిష్ఠంగా ఉపయోగించుకుంటోంది. తాజాగా రైతులకు ధాన్యం అమ్ముకునే విషయంలో ఎలాంటి సమస్యలు లేకుండా కొత్త కాన్సెప్ట్ అమల్లోకి తెచ్చింది. వాట్సాప్లో HI చెబితే ధాన్యం కొనుగోలు చేసేలాఏర్పాట్లు చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వ్యయప్రయాసలు అక్కర్లేకుండా ఈ ఏర్పాట్లు చేశారు. 73373 59375 నంబర్ కు వాట్సాప్ నుంచి HI చెబితే సేవలన్నీ అందుబాటులోకి వస్తాయి. ‘ఏ కేంద్రం, ఏ రోజు, ఏ టైమ్, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు విక్రయిస్తారో మెసేజ్ పెట్టగానే స్లాట్ బుక్ అవుతుంది. ఆ వెంటనే కూపన్ కోడ్ జనరేట్ అవుతుంది. దాని ప్రకారం ధాన్యం విక్రయించుకోవచ్చు.
ప్రస్తుతం రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే మాన్యూవల్ గా ప్రయత్నాలు చేయాలి. వ్యవసాయ అధికారుల జోక్యం ఉంటుంది. అది కొంచెం శ్రమతో కూడుకున్న పద్దతి. రైతు పలు చోట్ల తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన విధానంతో ఒక్క క్లిక్ తో ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం వస్తే అలాంటి చోట్ల అమ్ముకునేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన వెసులుబాట్లు కల్పించింది.ధాన్యం సేకరించిన తరవాత డబ్బులు కూడా వేగంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వం దాన్యం మాఫియాను నడపడంతో రైతులు ఎక్కువగా ఇబ్బంది డేవారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది. టెక్నాలజీని ఉపయోగించుకుని రైతులకు పూర్తి స్థాయిలో మేలు జరిగేలా చేయడంలో ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. రైతులకు అందించే సేవల విషయంలో మరింత జోరుగా టెక్నాలజీ వినియోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.