వైసీపీలో సీనియర్లు ప్రెస్ ముందుకు రావాలన్నా స్క్రిప్ట్ ఉండాల్సిందే. హైకమాండ్ నుంచి అంటే సజ్జల ఆఫీసు నుంచి స్క్రిప్ట్ రాకుండా ఎవరూ మీడియాతో మాట్లాడటానికి లేదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. స్టేట్ కోఆర్డినేటర్ గా అధికారికంగా ప్రకటించక ముందే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని గుప్పిట్లో పెట్టుకున్నారు. మీడియాలో ఎలాంటి ఫోకస్ రావాలో తెలిసినంతగా మరెవరికి తెలియదని అందుకే ఏం మాట్లాడాలో కూడా తానే చెబుతానని ఆయన అంటున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి దెబ్బకు తట్టుకోలేక జగన్ రెడ్డికి స్పీచ్ లు రాసే జీవీడీ కృష్ణమోహన్ అనే వ్యక్తి పదేళ్ల పాటు ఏటా మూడు లక్షల జీతం తీసుకుని.. ఫలితాలు వచ్చిన రోజు మధ్యాహ్నమే కనిపించకుండా పోయారు. ఆయనకు పార్టీ పరంగా జీతం ఇచ్చి కొనసాగించే అవకాశం ఉన్నా.. ఆయన తానిక జగన్ కు పని చేయలేనని చెప్పి వెళ్లిపోయారు. ఇదే సందనుకుని ఆ బాధ్యతను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తానే తీసుకుని ఓ వ్యక్తికి ఇచ్చారు. అతను రాసిన స్క్రిప్టులే మీడియా ముందు చదవాలని పార్టీ నేతలకు సందేశం ఇచ్చారు.
దీంతో చాలా మంది సీనియర్లు మీడియాతో మాట్లాడాలని పార్టీ నుంచి సందేశం వచ్చినా మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. పట్టించుకోవడం లేదు. కొంత మందిని మాత్రం ప్రత్యేకంగాపిలిపించి ప్రెస్మీట్లు పెట్టిస్తున్నారు. ఆదిమూలపు సురేష్ లాంటి వారిని పిలిపించి బడ్జెట్ మీద మాట్లాడిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు చూసి చాలా మంది సీనియర్లు ఇక వీరు మారరు అనుకుని సైలెంటుగా ఉంటున్నారు. జగన్ రెడ్డికి చెప్పే పరిస్థితి లేదని.. చెప్పినా వినరని వారికి అర్థమైపోయిది. వైసీపీ అత్యంత ఘోర పరాజయానికి మొదటి కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం. కానీ ఆయన గుప్పిట్లోనే ఇప్పటికీ పూర్తిగా పార్టీ ఉందంటే ఇక మార్పు ఎలా ఊహించగలమని వారు మథనపడుతున్నారు.