హైదరాబాద్ శివారులోని చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాగానే గుర్తింపు పొందింది. నివాస అనుకూలమైన ప్రాంతంగా ఇంకా పెద్దగా గుర్తింపు పొందలేదు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి సాదాసీదాగానే ఉంది. ఇప్పుడు చర్లపల్లిలో కేంద్ర ప్రభుత్వం రైల్వే టెర్మినల్ ను అత్యంత భారీగా నిర్మించింది. కనీసం 9 ఫ్లాట్‌ఫామ్‌లపై రైళ్ల రాకపోకలు సాగేలా నిర్మించింది. ఎయిర్ పోర్టు స్థాయి సౌకర్యాలతో ఈ రైల్వేస్టేషన్ ఉంది., ముందు ముందు సికింద్రాబాద్ పై ఒత్తిడి తగ్గించి కొన్ని ప్రధానమైన రైళ్ల రాకపోకల్ని ఈ స్టేషన్ నుంచి మాత్రమే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
నిజానికి పారిశ్రామికంగా మెరుగుపడినా రవాణా సౌకర్యాల విషయంలో చర్లపల్లి వెనుకబడి ఉంది. ఎంఎంటీఎస్ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుకే నగరం విస్తరిస్తున్నా.. అక్కడ ఇతర ప్రాంతాల్లో పెరిగినట్లుగా రియల్ ఎస్టేట్ పెరగలేదు. కానీ మధ్యతరగతి ప్రజలకు మాత్రం వరంగా ఉంది. చర్లపల్లి, కుషాయిగూడ, మల్లాపూర్, నాచారం ప్రాంతాల్లో వందల సంఖ్యలో కాలనీలు పుట్టుకొస్తున్నాయి. షాపింగ్ మాల్స్, కళాశాలలు క్రమంగా పెరుగుతున్నాయి. గృహ నిర్మాణాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కొనుగోలు చేయడానికి ఇప్పుడు అనుకూలమైన ప్రాంతంగా మారింది. డిమాండ్ ఉన్న ప్రాంతం కావడంతో బ్యాంకు రుణాలు సులభంగా లభిస్తున్నాయి.ఇక్కడ ఫ్లాట్ కొన్నవారు తిరిగి అమ్మాలనుకున్నా ధర బాగి పలికి మంచి లాభాలు వస్తాయి.
ప్రస్తుతం చర్లపల్లి ప్రాంతంలో ఇక్కడి ప్లాట్లు ఎస్ఎఫ్టీ రూ.4,000-7,000 వరకు పలుకుతోంది. వసతులు, ఆధునిక హంగులతో నిర్మాణాలు జరిగిన వాటికి గిరాకీ ఉంటోంది. కొందరు బిల్డర్లు ప్రత్యేక ఆఫర్లు పెట్టి అమ్ముతున్నారు. రియల్ ఎస్టేట్ జనాల అభిరుచికి అనుగుణంగా ప్లాట్ల నిర్మాణంలో మార్పులు చేస్తున్నారు బిల్డర్లు. ఆధునిక డిజైన్లు, యువతకు కావాల్సిన ఉడ్ వర్క్‌తో నిర్మిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి కావాల్సిన సౌకర్యాలూ ఏర్పాటు చేస్తున్నారు.
పెట్టుబడి లక్ష్యంతో చర్లపల్లి ప్రాంతంలో ఇళ్లు ,స్థలాలు కొనుగోలు చేసినా మంచి రిటర్మ్స్ వస్తాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.