దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. తనపై నమోదైన కేసుకు సంబంధించి ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఆయన చేసిన పోస్టింగుల గురించి తెలుసుకుని పిటిషన్ కొట్టివేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు కూడా నిరారించింది. దీంతో ఆర్జీవీని అరెస్టు చేయడానికి పోలీసులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయినట్లయింది.
ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు ఆయనకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. వైసీపీ హయాంలో ఆయన ప్రభుత్వం నుంచి ప్రజాధనం రూ. కోటిన్నర వరకూ తీసుకుని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్పటి ప్రతిపక్ష నేతలపై జుగుప్సాకరమైన ట్వీట్స్ చేశారు. కుటుంబాలను సైతం కించ పరిచేలా ఉన్న ఆ ట్వీట్స్ లో మార్ఫింగ్లు కూడా ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం సోషల్ మీడియా కీచకులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో ఆర్జీవీపైనా కేసులు పెట్టింది.
దేశవ్యాప్తంగా పేరున్న దర్శకుడు అయిన ఆర్జీవీ .. డబ్బుల కోసం ఇలాంటి ట్వీట్లు పెట్టారని.. ఆ ట్వీట్ల కారణంగా ఆయన అరెస్టు అయ్యారని తెలిస్తే.. ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ పోయి.. ఆయన గురించి ఓ నీచ మానవుడిగా అందరూ చర్చించుకుంటారు. అలాంటి పరిస్థితిని డబ్బుల కోసం కక్కుర్తి పడి ఆర్జీవీనే తెచ్చుకున్నారు. ముందు ముందు ఆయనపై మరిన్ని కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.