ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్న పోసానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే సమయం దగ్గర పడినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ పైనా ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయడం వేరు.. సీఐడీ కేసు నమోదు చేయడం వేరు.
పోసాని కృష్ణమురళి తనను పోలీసులు అరెస్టు చేస్తే ఇంకా రచ్చ చేయవచ్చన్న ఉద్దేశంతో .. పాలకులపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఎవరూ ఏమీ అనక ముందే నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన నటనలో రాటుదేలిపోయారు కానీ..ఇప్పటికే లోకేష్ ప్రైవేటు కేసు వేశారు. కోర్టు ఆదేశాలతో రాజమండ్రిలో ఓకేసు నమోదు అయింది. అయితే ఇవన్నీ చంద్రబాబు, పవన్ సీఎం , డిప్యూటీ సీఎంలు కాక ముందే అన్నారు. ఇప్పుడు వారిద్దరూ పదవుల్లోకి వచ్చిన తర్వాత కూడా అన్నారు. అంటే ఆయనను ఇక క్షమించే అవకాశం ఉండదు.
ఇలా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేసే వారిపై న్యాయస్థానాలు కూడా ఏ మాత్రం జాలి చూపడం లేదు. ఆర్జీవీకి అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి కూడా నిరాకరించారు. వాక్ స్వేచ్చ అంటే ఇతర కుటుంబాల్లోని మహిళలకు..కుటుంబాలకు రంకులు అంటగట్టడం కాదని .. అందరికీ సందేశం ఇచ్చేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిది. పోసానికి కూడా అలాంటి ట్రీట్ మెంట్ రెడీ అవుతోందని అనుకోవచ్చు.