శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఒక మనసుపై అందరి దృష్టీ పడింది. నిహారిక డెబ్యూ మూవీ గనుక ఎలా ఉంటుందో.. అంటూ అంతా ఆశగా ఎదురుచూశారు. కానీ.. ఈ సినిమా ఎవరి అంచనాల్నీ అందుకోలేక బాక్సాఫీసు దగ్గర చతికిల పడింది. ఇదేం సినిమారా బాబూ… రోడ్ రోలర్‌పై జర్నీ చేసినంత స్లోగా ఉంది అంటూ.. సెటైర్లు వేసుకొంటున్నారంతా. ఈ టాక్.. చిత్రబృందం వరకూ వెళ్లింది. సినిమా స్లో అయ్యిందన్న కామెంట్‌ని కప్పిపుచ్చుకోవడానికి పావుగంట సినిమా లేపేశారు. అదీ ఫస్టాఫ్ లో. పావు గంట సినిమాకట్ చేశాక.. సినిమా బాగుంది అంటున్నారు నిర్మాత మధుర శ్రీధర్.
శ్రీధర్‌కి దర్శకుడిగానూ అనుభవం ఉంది. ఆ అనుభవం కొద్దీ ఆయన రామరాజు కి కొన్ని సలహాలిచ్చాడట! అవి కొంత వరకూ వర్కవుట్ అయ్యాయని చెబుతున్నాడు మధుర శ్రీధర్. ఇలాంటి సినిమాలు స్లోగా ఉన్నా.. జనాలకు ఎక్కేస్తాయంటున్నారాయన. ”ఫస్టాఫ్ స్లోగా ఉందన్న కంప్లైంట్ వచ్చింది. అయితే రామరాజు సినిమాలు పొయెటిక్ గా ఉంటాయి. ఆ ఫీలింగ్స్నచ్చిన వాళ్లు మాత్రం సినిమా బాగుందంటున్నారు. అయితే కొన్ని సన్నివేశాల్ని ట్రిమ్ చేశాం. ఇప్పుడు ఆ కంప్లైంట్ కూడా లేద”న్నారు. మరి ఈ కటింగులు అయ్యాక ఒక మనసుపై ఉన్న ఆ స్లో అనే ముద్ర చెరిగిపోతుందేమో చూడాలి.