తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలిపిరిలో .. ముంతాజ్ హోటల్ స్వాగతం పలుకుతుంది. ఈ ఏర్పాట్లను జగన్ చేసి వెళ్లారు. తిరుపతిలో ప్రతి చిన్న హోటల్‌కు శ్రీనివాసుడి పేరు పెట్టుకోవడం కామన్. మరి ఈ ముంతాజ్ పేరు ఎక్కడ నుంచి వచ్చింది ?. అంత నిరభ్యంతరంగా ఎలా పెట్టగలిగారు ?. శ్రీనివాసుడి భక్తులతో వ్యాపారం చేస్తూ అన్యమత పేరుతో ఎలా హోటల్ పెడతారు ? అని సందేహాలు వస్తే అదంతా జగన్ రెడ్డి నిర్వాకం అని ఒక్క ఆన్సర్‌తో అర్థం అయిపోతుంది.
దేవలోకం ప్రాజెక్టును క్యాన్సిల్ చేసి ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిన జగన్
చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు దేవలోకం అనే ప్రాజెక్టును అలిపిరిలో ప్లాన్ చేశారు. ఇందు కోసం ఇరవై ఐదు ఎకరాలు కేటాయించారు. టూరిజం శాఖ పనులు ప్రారంభించకముందే జగన్ రెడ్డి ఒక్క చాన్స్ అంటూ వచ్చేశారు. తర్వాత అన్నింటిలా దాన్ని కూడా ఆపేశారు. చివరికి ఐదు ఎకరాలు ఉంచుకుని ఇరవై ఎకరాలు ముంతాజ్ హోటల్స్ వాళ్లు స్టార్ హోటల్ కడతామంటే ఇచ్చేశారు. అదీ కూడా దాదాపుగా ఉచితంగానే.
90 ఏళ్ల లీజు – అణాకాణీలకే !
90 ఏళ్ల పాటు లీజు. నాలుగేళ్ల పాటు నిర్మాణ సమయం కలుపుకుని 94 ఏళ్లు లీజుకిచ్చారు. లీజు ఎంత అంటే ఆ స్థలానికి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో అందులో ఒక్క శాతమన్నమాట. అక్కడ ఎకరం పది లక్షలు ఉంటే పదివేలు.. ఇరవై ఎకరాలకు కలిపి ఏటా రెండు లక్షలు లీజు. ఇంత ఖరీదైన స్థలం ఇస్తే వారు పెట్టే పెట్టుబడిలో 1500 ఉద్యోగాలు వస్తాయట. అయినా ముంతాజ్ అనే పేరు పెడతారట. ఈ గ్రూప్ ఒబెరాయ్ హోటల్ వాళ్ల సబ్సిడరీ. ఇందులో వైసీపీ నేతల బినామీ వాటాలు ఉన్నాయేమో కానీ.. పట్టించుకోలేదు. పెద్ద వివాదం అవుతుందని కూడా లెక్క చేయలేదు. ఇప్పుడు అక్కడ పునాదులు నవ్వేశారు.
కేటాయింపును రద్దు చేయాలంటున్న టీటీడీ బోర్డు
ఇప్పుడీ ప్రాజెక్టును రద్దు చేసి తిరిగి.. ఆ భూమిని దేవలోకం ప్రాజెక్టుకు కేటాయించాలని కొత్త టీటీడీ బోర్డు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది. టూరిజం ప్రమోషన్ పేరుతో ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా ఇచ్చేసిన వైనంతో పాటు శ్రీవారి చెంతనే అన్యమత సంస్థ తరహాలో నిర్మాణం చేయడం భక్తులను ఆగ్రహానికి గురి చేసేదే. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.