ఆంధ్రజ్యోతి ఆర్కేతో విజయసాయిరెడ్డి పెట్టుకున్న పంచాయతీకి మాజీ న్యాయమూర్తులే కావాలట. అలా అయితే చర్చకు వస్తానని విజయసాయిరెడ్డి తాజాగా రిప్లయ్ ఇచ్చారు. శనివారం రోజున విజయసాయిరెడ్డిపై ఆంధ్రజ్యోతి ఆర్కే తన కామెంట్లో సగం సమయం నిప్పులు చెరిగారు. ఆయన తనను తరచూ కలుస్తారని ప్రకటించారు. ఆయన రాజకీయ బుద్ది వేశ్య లాంటిదని ఉదహరించారు. అప్పట్నుంచి సైలెంటుగా ఉన్న ఆయన తాజాగా స్పందించారు. ఆర్కే సవాల్ విసిరినట్లుగా చర్చకు రెడీ అన్నాడు.
ఇక్కడ తన రాజకీయ నేత తెలివి తేటలు ప్రదర్శించారు. చర్చకు రెడీ కానీ.. అది ఏబీఎన్ లో కాదని.. పుర ప్రముఖులు, మాజీ న్యాయమూర్తులే జడ్జిలుగాఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి చేసిన వెధవపనుల గురించి చర్చ పెట్టుకుంటే దానికి మాజీ న్యాయమూర్తులు వచ్చి తీర్పు చెప్పాలన్నట్లుగా ఆయన బిల్డప్ ఉంది. అలా అయినా సెట్ చేస్తారేమోనని భయపడి తాను ఐక్యరాజ్యసమితికి వెళ్తున్నానని వెళ్లొచ్చాక చూసుకుందామని లింక్ పెట్టారు.
నాన్ అఫీషియల్ బృందంలో భాగంగా ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలను పరిశీలించడానికి వెళ్లే ఎంపీల్లో విజయసాయిరెడ్డి పేరు ఉంది. దానికే ఆయన తానేదో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి భారత్ ప్రతినిధిగా వెళ్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆర్కేతో డిబేట్ విషయంలోనూ ఆ ప్రస్తావన తెచ్చారు. ఇంతకీ ఆయన ఐక్యరాజ్యసమితికి ఎప్పుడు వెళ్తారో స్పష్టత లేదు.
విజయసాయిరెడ్డి ఎలాంటి రాజకీయం చేస్తారో జగన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలకూ అర్థం అయింది. ఇప్పుడు ఆర్కే ద్వారా అందరి ముందు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఆర్కే సవాల్ ను ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించి.. రాజకీయ తెలివితేటలు చూపించారు. ఈ డిబేట్ ను ఆయన పిచ్చి పిచ్చి షరతులు పెట్టి వదులుకుంటే…. విజయసాయిరెడ్డిని ఆర్కే ఎప్పటికప్పుడు చులకన చేస్తూనే ఉంటారు.