జగన్ రెడ్డికి సలహాదారులు ఎవరో కానీ ఆయనను నిండా ముంచేసేదాకా వదిలి పెట్టడం లేదు. తాజాగా ఆయన ఏపీ అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాను నిజం చెబుతానంటూ ప్రెస్మీట్ పెట్టారు. ఆయన బడ్జెట్ గురించి చెప్పింది ఒక్కరంటే ఒక్కరూ పట్టించుకోలేదు. కానీ ఆ ప్రెస్ మీట్ అయిపోయాక..తన చెల్లి షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారని ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా షర్మిల పాత వీడియో ఒకటి ప్లే చేయించారు.
ఆ వీడియో చూసిన వారికి నిజంగానే జగన్ మానసిక పరిస్థితిపై అనుమానం వస్తుంది. 2019 ఎన్నికలకు ముందు తెలంగాణ పోలీసుల్ని వాడుకుని టీడీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేశారు. ఆ సమయంలో కొంత సినీ హీరోలకు చెందిన ట్రోలర్స్.. షర్మిలకు ఓ హీరోతో లింక్ పెట్టి పోస్టులు పెట్టారు. ఆ పోస్టుల్ని రాజకీయ లబ్దికి వాడుకునేందుకు షర్మిలతో ఫిర్యాదు చేయించారు. హైదరాబాద్లోని ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి పోస్టులు పెట్టారని పోలీసులతో చెప్పించారు. ఆ బిల్డింగ్స్ నుంచి పెట్టారు కాబట్టి బాలకృష్ణనే పెట్టించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే మాట చెబుతున్నారు.
జగన్ రెడ్డి తీరు చూసిస అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రెస్ మీట్ జగన్ తన వికారాన్నంతా చూపించారు. తన తల్లి తనను ఛీకొడుతున్న విషయం అందరి ముందు ఉంటే ఆయన మాత్రం చంద్రబాబు తల్లి, చెల్లి గురించి మాట్లాడుతున్నారు. జకీయంగా ఎదిగిన తర్వాత తన తల్లిదండ్రులను ఇంటికి పిలిచి చంద్రబాబు రెండు పూటలా భోజనం కూడా పెట్టలేదని జగన్ చెప్పారు. కాలం చేస్తే తలకొరివి కూడా పెట్టలేదన్నారు. అలాంటి వ్యక్తి తన కుటుంబంపై రాజకీయాలు చేస్తున్నారని..అంటున్నారు.
చంద్రబాబు తల్లిదండ్రుల్ని ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం ఏమిటో కానీ.. వారిద్దరూ చంద్రబాబుపై ఎప్పుడూ ఆరోపణలు చేయలేదు. ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మలకు చంద్రబాబు ఎప్పుడూ లోటు చేసినట్లుగా ఎప్పుడూ ఎవరూ చెప్పలేదు కూడా. కానీ జగన్ రెడ్డి మాత్రం తన వికారాన్నంతా మరోసారి బయట పెట్టుకున్నారు.