పవన్ కల్యాణ్ కూటమి నుంచి విడిపోతే వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం ఉంటుందని ఆశపడుతున్న వైసీపీకి జనసేనానికి ఎప్పటికప్పుడు షాక్ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల చేస్తున్న హిందూత్వ రాజకీయం, మహారాష్ట్ర ప్రచారంలో కూడా పూర్తిగా ఆయన బీజేపీ భావజాలంతో చేసిన ప్రచారం వల్ల పవన్ దక్షిణాది మొత్తం విస్తరించడానికి ప్లాన్ చేసుకుంటున్నారని అంతా బీజేపీ మార్గనిర్దేశనంలో జరుగుతోందని కొంత మంది ప్రచారం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల నాటికి కూటమి నుంచి విడిపోతారని ఆశలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారికి పవన్ తన మాటలతోనే సమాధానం ఇస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని తీరు ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. అందులో సందేహం ఉండదు. ఆయన కింది స్థాయి ప్రజల్ని ఎలా డీల్ చేస్తారో.. ఉన్నత స్థాయిలో పారిశ్రామిక వేత్తల్ని ఏపీకి తీసుకు వచ్చేందుకు వారి స్థాయిలోనే డీల్ చేస్తారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అందరూ అనుకుంటారు. పవన్ కల్యాణ్ కూడా అదే అనుకుంటున్నారు. అందుకే చంద్రబాబు తప్ప మరొకరు ఈ రాష్ట్ర సీఎం అనే భావన రాకూడదని ప్రకటనలు చేస్తున్నారు. కూటమి విచ్చిన్నం అవుతుందని ఆశలు పెట్టుకున్నవారికి ఎప్పటికప్పుడు షాకులు ఇస్తున్నారు.
నిజానికి కూటమిలో పవన్ కల్యాణ్ చిచ్చు పెట్టారని అనుకున్నారు. కానీ వైసీపీని నిండా ముంచడానికి వేసిన అసలైన ఎత్తుగడ అని అర్థమయ్యే సరికి ఇంత సులువుగా ట్రాప్లో ఎలా పడిపోయామని వైసీపీ నేతలు కూడా కిందా మీదా పడిపోతున్నారు. పవన్ కల్యాణ్ తన ఆవేశంలోనూ అసలైన రాజకీయం చేస్తున్నారని.. వైసీపీకి ఇది అత్యంత క్లిష్టమైన సమయం అని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో కొంత మంది వైసీపీ ట్రాప్లో పడే జనసైనికులు.. పవన్ సీఎం అనే కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాంటి వారికీ పవన్ తన వ్యాఖ్యల ద్వారా సంకేతాలు పంపారని అనుకోవచ్చు.