సెకీ పేరుతో విద్యుత్ ఒప్పందాలను ఆదానీ సంస్థతో చేసుకుని పాతికేళ్ల పాటు ఏపీ ప్రజల్ని దోపిడీ చేసుకునే చాన్స్ ఇచ్చినందుకు రూ.1750 కోట్ల లంచాలను జగన్ రెడ్డి తీసుకున్నారని అమెరికా కోర్టు నిర్దారించింది. ఇతర రాష్ట్రాల్లోనూ అదానీ గ్రూపు లంచాలు ఇచ్చింది. మిగిలిన ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.350 కోట్ల లంచాలు ఇస్తే ఒక్క జగన్ రెడ్డే రూ.1750 కోట్లు తీసుకున్నారంటే ఎంత బరి తెగింపో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒప్పందాలు చూపించే అమెరికా నుంచి పెట్టుబడులు పట్టుకొొచ్చారు. ఆ దరిద్రం అంతా అక్కడ బయటపడటంతో ఇండియాలో గగ్గోలు రేగుతోంది.
అదానీని అరెస్టు చేయాలంటూ రాహుల్ గాంధీ నుంచి పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో అదానీకి పడాల్సిన శిక్ష పడుతోంది. ఆయన కంపెనీలు స్టాక్ మార్కెట్లో క్రాష్ అయ్యాయి.రెండు లక్షల కోట్లకుపైగా సంపద ఆవిరి అయిపోయింది. చట్టపరంగా ఇండియాలో ఏమైనా చర్యలు ఉంటాయో లేదో కానీ అమెరికాలో మాత్రం ఆయనపై కేసు నమోదు అయింది. అక్కడి లిస్టెట్ కంపెనీతో పెట్టుకోవడంతో అదానీకి చిక్కులు తప్పలేదు. అయితే భారత్ లో మాత్రం ఆయన లంచం ఇచ్చిన వ్యక్తి. తీసుకున్న వారు జగన్ తో పాటు ఇతరులు.
ఇప్పుడు ముందుగా అరెస్టు చేయాల్సి వస్తే ఉన్న పళంగా జగన్ రెడ్డిని అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించాలి. ఆ రూ.1750 కోట్లు ఎక్కడకు తరలించారో తేల్చాలి. ఐదేళ్ల కాలంలో ఇంకెన్ని వేల కోట్లు దోపిడీ చేశారో తేల్చాలి. ఆ తర్వాత అదానీని అరెస్టు చేయాలి. కానీ మన దేశలో చట్టాలు ఎంత గొప్పగా ఉంటాయో జగన్ రెడ్డి లాంటి దోపిడీదారు అన్ని కేసులు ఉన్న తర్వాత కూడా ముఖ్యమంత్రి అయి ఐదేళ్ల పాటు అడ్డగోలుగా మళ్లీ దోచుకునే చాన్స్ వచ్చేలా చేసింది. పన్నెండేళ్ల నుంచి ఆయన బెయిల్ పై ఉన్నారు. మరి ఇలాంటి వ్యవస్థలో జగన్ రెడ్డి లాంటి అవినీతి పరుల్ని అరెస్టు చేయడం సాధ్యమేనా ?