ఇండస్ట్రీ నేపధ్యం వున్న కుటుంబాల నుంచి నటులుగా వస్తే లాంచింగ్ సులువుగా దొరుకుందేమో కానీ, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అంత సలువు కాదు. ఒక బ్రేక్ వచ్చేవరకూ ఫలనా వారి అబ్బాయి, ఫలానా వారి మనవడు, మేనల్లుడు ఇలాంటి పరిచయాలే వుంటాయి.
ప్రస్తుతానికి అశోక్ గల్లా పరిచయం కూడా ఇలానే జరుగుతోంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, జయదేవ్ గల్లా కుమారుడనే ఆయన్ని సంభోదిస్తున్నారు. అశోక్ చేసిన తొలి సినిమా హీరో ఆశించిన బ్రేక్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కథతో దేవకీ నందన వాసుదేవ సినిమాతో ఈ వారం ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.
ఈ సందర్భంగా అశోక్ ని మహేష్ మేనల్లుడు ట్యాగ్ గురించి అడిగితే.. ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఆ ట్యాగ్ పోవాలంటే హిట్ కొట్టాలి. హిట్ కొడితేనే ఇక్కడ మనకంటూ ఒక స్థానం వుంటుంది’ అని చాలా హానెస్ట్ అన్సర్ ఇచ్చారు.
మహేష్ బాబు కథల ఎంపిక విషయంలో సహాయం చేస్తారా అనే ప్రశ్నకు” మహేష్ గారికి సలహాలు ఇవ్వడం అంటే భయం. ఆయనకి ఇవ్వాలని వున్నా ఇవ్వరు. ఇక్కడ ఎవరి కథలు వారే ఎంపిక చేసుకొని ముందుకు సాగలనేది ఆయన సిద్ధాంతం. ఒకరిపై ఆధారపడితే అక్కడే పాకుతూ వుండిపోతామని ఆయన భయం. నాకు కూడా స్వతహాగా ముందుకు వెళ్ళడమే ఇష్టం. నా కథలని నేనే ఎంచుకుంటాను. దేవకీ నందన నేను కోరుకునే బ్రేక్ ఇస్తుందనే నమ్మకం వుంది’ అని చెప్పుకొచ్చారు అశోక్.