రేపోమాపో అరెస్టు చేసి కుమ్మేస్తారని భయపడుతున్న వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఇక రాజకీయాలు మాట్లాడనని ప్రకటించారు. హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టిన ఆయన ఇకపై నేను రాజకీయాలు మాట్లాడనని.. నా జీవితాంతం వరకు రాజకీయాల జోలికి పోనని చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల జీవితం నేను ఎవరికి తలవంచలేదని.. తాను మగవాడ్నని చెప్పుకొచ్చారు. ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను తిట్టరా.. అయినా తాను పట్టించుకోననన్నారు. అందరికీ కంటే ఎక్కువగా తనను చంద్రబాబు పొగిడారని.. శ్రావణ మాసం సినిమా రిబ్బన్ కటింగ్ రోజున 100.అడుగుల కటౌట్ పెట్టానని చేసుకున్నారు.
పోసాని అవస్థలు చూసి జనం కూడా నవ్వుకుంటున్నారు. జగన్ రెడ్డికి మానసిక ఆనందం కల్పించడం కోసం ఇష్టం వచ్చినట్లుగా తిట్టినట్లు తిట్టిన ఆయన ఇప్పుడు తనను
చంద్రబాబు అందరి కంటే ఎక్కువ పొగిడారని చెప్పుకుటున్నారు. పవన్ కల్యాణ్ తో పాటు చంద్రబాబు,లోకేష్ పై ఆయన మాట్లాడిన మాటల్ని ఎవరూ మర్చిపోలేరు. ఇక తాను రాజకీయాల జోలికి రానని చెప్పినా వదిలేస్తారనుకోవడం అమాయకమే.
ఇటీవల కూడా ఆయన నోటి దురుసుతనం చూపించారు. రాజకీయాలంటే విధానాల పరంగా ప్రశ్నించడం కాకుండా.. బూతులు తిట్టుకోవడం అనే సంప్రదాయాన్ని పోసానినే ప్రారంభఇంచారు. ఆయన గత పదేళ్లుగా చంద్రబాబును, పవన్ ను.. లోకేష్ ను తిట్టని తిట్టులేదు. లోకేష్ చివరికి మంగళగిరి కోర్టులో ప్రైవేటు కేసు కూడా దాఖలు చేశారు. తాను మగాడ్నని చెప్పుకున్న ఆయన కేసులు ఫేస్ చేయాల్సింది పోయి.. కాళ్లు పట్టుకోవడం ఎందుకన్న ప్రశ్నలు వస్తున్నాయి.