అదానీ అమెరికా అవినీతి వ్యవహారంలో ప్రధాన పాత్ర జగన్ రెడ్డిదే కనిపిస్తూండటంతో తమను ఎక్కడ టార్గెట్ చేస్తారోనని వైసీపీతో పాటు జగన్ రెడ్డి కూడా కంగారు పడుతున్నారు. అసలు ఆరోపణలేంటి చెప్పకుండా.. ఏపీ ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకోలేదని.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెకీతో ఒప్పందం చేసుకున్నామని వాదించడం ప్రారంభించారు. అంటే ఇందులో బీజేపీకి, కేంద్రానికి వాటా ఉందని నేరుగా వాదించడానికి సిద్దమయ్యారన్నమాట.
అసలు స్కామ్ ఎలా చేయాలో తెలిసిన వాళ్లంతా కలిసి చేసిన స్కామ్ ఇది. పేరుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం.. కానీ ఆ ఒప్పందాల్లో సెకీకి సరఫరా చేసేది అదానీనే. అక్కడే అసలు కిటుకు ఉంది. అదానీ సంస్థ సెకీ ద్వారా ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేస్తుంది. దీని వల్ల లాభం ఎవరికి ?. సెకీని అడ్డం పెట్టుకుని అదానీతో లావాదేవీలు లేవని చెప్పడానికి చేసిన బహిరంగ స్కామ్ ఇది. కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమీ జరగలేదని బుకాయించడానికి పనికి వస్తుందని ఈ ప్లాన్ చేసుకున్నట్లుగా ఉన్నారు.
మార్కెట్లో రూ. 2కే వస్తున్నా.. రెండున్నర రూపాయలు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించడం.. సెకీ నుంచి ప్రతిపాదన వచ్చిన మరుసటి రోజే కేబినెట్ ముందు పెట్టి ఆమోదం తీసుకోవడం .. అంతకు ముందు అదానీ నాలుగు సార్లు జగన్ రెడ్డి ఆతిధ్యాన్ని స్వీకరించడం అంతా చాలా పెద్ద తెలివితేటలు ఉన్నాయి. మొత్తంగా ఈ వ్యవహారాన్ని జగన్..తెలివిగా బీజేపీకి కూడా పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది !