జగన్ రెడ్డి అనే వ్యక్తి వినాశనానికి పర్యాయపదంగా మారుతున్నాయి. ఆయన అత్యాశ, అవినీతి కారణంగా వ్యక్తులైనా, సంస్థలైనా..పార్టీ అయినా చివరికి కుటుంబం అయినా శంకరగిరి మాన్యాలు పట్టి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జగన్ రెడ్డి కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇదే పరిస్థితి. ఎంత ఘోరం అంటే ఇందులో హత్యలు ఉన్నాయి.. రాజకీయ ఆత్మహత్యలూ ఉన్నాయి. చివరికి జగన్ రెడ్డి కూడా నాశనం అయిపోతున్నారు.
బాబాయ్‌తో ప్రారంభించి ఫ్యామిలీ చిన్నాభిన్నం
జగన్ రెడ్డి కోసం వివేకానందరెడ్డిని పక్కన పెట్టి మరీ ఎంపీని చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే ఆయనకు చరిద్రం. కొంత కాలానికే ఆయన చనిపోయారు. ఎలా చనిపోయారన్నదానిపై ఎవరి వాదన వారు చెబుతారు కానీ.. ఆయన ఉపయోగించిన ప్రభుత్వ హెలికాప్టర్ ను అంతకు మూడురోజుల ముందు జగన్ పులివెందులకు టూర్ అనఫిషియల్‌గా తీసుకెళ్లారన్న వార్తలు ఉన్నాయి. ఈ అనుమానాల సంగతి పక్కన పెడితే అక్కడ ప్రారంభమైన వైసీపీ ఫ్యామిలీ వినాశనం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఫ్యామిలీచీలిక పేలికలయింది. వైఎస్ ఉన్నప్పుడు అంతర్గతంగాఏమున్నా అందరూ పైకి మాత్రం ఒకే ఫ్యామిలీ.కానీ ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. జగన్ పై తల్లి, చెల్లి ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా ఎవరి వల్ల.. ఓన్లీ వన్ జగన్ రెడ్డి వల్ల. ఆయన స్వార్థం వల్ల.
జగన్ తో డీల్స్ పెట్టుకుని జైలుకు పారిశ్రామికవేత్తలు
జగన్ తో అవినీతి డీల్స్ పెట్టుకుని జైలుకు పోయి సర్వనాశనం అయ్యే పారిశ్రామికవేత్తల సంఖ్య తక్కువేమీ లేదు. విదేశాలకో పోతే బొక్కలో వేస్తారని భయపడి ఇక్కడే ఉండిపోయేవారు పదుల సంఖ్యలో ఉన్నారు. మ్యాట్రిక్స్ ప్రసాద్, పొట్లూరి ప్రసాద్ నుంచి నేటి అదానీకి వరకూ అందరూ శంకరగిరి మాన్యాలు పట్టి పోయే పరిస్థితి ఏర్పడుతోంది. జగన్ రెడ్డి అవినీతి, కక్కుర్తితో వారిని కూడా తన దారికి తెచ్చుకుని .. కొంత మేసి.. వారికి కొంత పెట్టి చేస్తున్న వ్యాపకాలతో వారికి ఎంత మిగులుతుందో కానీ పరువుపోయి.. వ్యాపారాలు నాశనం అయి రోడ్డున పడుతున్నారు. జగన్ నీడ పడిన ప్రతి ఒక్క పారిశ్రామిక వేత్త పరిస్థితి అదే.
నమ్ముకున్న పార్టీ నేతల రాజకీయ భవిష్యత్‌తో ఆటలు
జగన్ రెడ్డిని నమ్ముకుని ఆయనతో పాటు నడిచిన వారి రాజకీయ జీవితాన్ని దాదాపుగా భూస్థాపితం చేశారు. అంతటి పెద్దిరెడ్డి కూడా పీఏసీ సభ్యుడి పదవి కోసం పోటీ చేసి తన ఓటు కూడా తాను వేసుకోలేకుండా పరాభవంతో వెనుదిరిగిపోయారు. వైసీపీని నమ్మి రాజకీయం చేసిన కొడాలి, వల్లభనేని వంటి వారు ప్రాణభయంతో బితుకుబితుకుమంటున్నారు. ఎవరికీ రాజకీయభవిష్యత్ కనిపించడం లేదు. ఇక ఆయనను నమ్మిన కార్యకర్తలను ఆర్థికంగాచితికి పోయేలా చేశారు.
జగన్ రెడ్డి బాగుపడుతున్నాడా ?
అందరి జీవితాల్ని నాశనం చేసి జగన్ రెడ్డి ఏమైనా బాగుపడుతున్నాడా అంటే.. ఆయన కూడా తన నెత్తి మీద తాను చేయి పెట్టుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పార్టీ పాతాళంలోకి పడిపోయింది. అవినీతి కేసులు బయటకు వస్తున్నాయి. చెల్లి చేస్తున్న ఆరోపణలకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు. తనకు డబ్బు మాత్రమే మిగిలింది. అదైనా ఉంటుందో లేదో తెలియదు. మొత్తంగా జగన్ రెడ్డి నీడ పడితే