జమిలీ ఎన్నికలు ఉంటాయి.. 2027లోనే వస్తాయి అని పాడుకుంటున్న వైసీపీ నేతలకు చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చారు. ఏపీలో జమిలీ ఎన్నికలు ఎప్పటి నుంచో జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మొన్నటి ఎన్నికలలోనూ ఏపీలో జమిలీ ఎన్నికలే జరిగాయి. మరి ముందు రావడం ఎలా సాధ్యం ?. అదే విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేశారు. 2029లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని ఎమ్మెల్యేలకు చెప్పారు.
వైసీపీ నేతలు ముందస్తు జమిలీ ఎన్నికలు వస్తాయని పార్టీ నేతల్ని ఆశపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారుల్ని బెదిరించేందుకు జమిలీని వాడుకుంటున్నారు. కానీ అసలు రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. కేంద్రంలోఅత్యంత కీలమైన పొజిషన్లో ఉన్న చంద్రబాబు.. జమిలీ ఎన్నికలకు అనుకూలంగానే ఉన్నారు. కానీ ముందుగా వస్తాయన్న అంచనాలు మాత్రం తప్పంటున్నారు. నిజానికి ముందుగా జరుపుతారని ఎవరు కూడా అనుకోవడం లేదు ఒక్క వైసీపీ తప్ప.
లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అంతకు మూడు నెలల ముందు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలు.. ఆ తర్వాత ఐదు నెలల్లో మరో ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరుగుతాయి. అంటే ఆరు నెలల కాలపరిమితిని పెట్టుకుని చూస్తే లోక్ సభతోపాటు సగం రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించేయవచ్చు. ఇతర ప్రభుత్వాల విషయంలో రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుంది. ఈ చిన్న లాజిక్ ను మిస్సయిన వైసీపీ ఆశలు పెంచుకుని నిరాశకు గురి అవుతోంది.