వైసీపీ అధినేత జగన్ రెడ్డిని ఏం చేయడానికైనా ఇప్పుడు చంద్రబాబుకు అవకాశం ఉంది. సంపూర్ణమైన ఆధారాలు ఉన్నాయి. ఓటమితో పాతాళంలోకి పడిపోయిన ఆయనను కప్పెట్టడానికి అవసరమైన సరంజామా, స్టఫ్ అంతా అమెరికాలో నమోదైన కేసుతో చంద్రబాబుకు చిక్కాయని ఇక చంద్రబాబు ఎలా గేమ్ ఆడతారో చూడాలని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో ప్రకటించారు.
అదానిపై అమెరికాలో నమోదైన కేసులో ఎవరెవరికి లంచాలు ఇచ్చారో చాలా స్పష్టంగా ఉందని ఆ కేసు నుంచి ఎవరూ బయటపడలేదని ఆర్కే వాదన. అసలు ఈ స్కాం మొత్తం ఎలా బయటకు వచ్చిందో సింపుల్ గా వివరించారు. సెకీ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డం పెట్టుకుని అదానీ, జగన్ ఆడిన కరప్షన్ గేమ్ ఆడారు.ఈ ఒప్పందాన్ని అడ్డం పెట్టుకుని అమెరికాలోని అజూర్ అనే కంపెనీ ద్వారా పెట్టుబడులు సేకరించారు.కానీ అదానీకి ఆ కంపెనీని డంప్ చేసేశారు. అక్కడే విషయం తేడా కొట్టింది. అమెరికాలో ఆ సంస్థ స్టాక్ ఎక్సేంజ్కు ఫిర్యాదు చేసింది. అక్కడ్నుంచి కథ మొదలు అయింది.
ఇక్కడ కూడా అదే గేమ్ నడిచింది. అసలు యూనిట్ రూ. 2.49 పైసలు అని చెబుతున్నారు కానీ యూనిట్ కు ట్రాన్స్ మిషన్ చార్జీలు , ఇతర చార్జీలు కలిపి ఐదు రూపాయల పైనే అవుతుంది. ఈ అదనపు చార్జీలకు కేబినెట్ అనుమతి తీసుకోలేదు. ఇక్కడే జగన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడని లంచాలు తీసుకున్నారని నిరూపించగలరో లేదో కానీ ఈ విషయంలో మాత్రం ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపడానికి అవసరమైన సరంజామా ఉందని ఆర్కే చెబుతున్నారు . ఇప్పుడు జగన్ రెడ్డిని ఏం చేయాలో అది చేయడానికి చంద్రబాబుకు అస్త్రం దొరికినట్లే అంటున్నారు.
చంద్రబాబు ఏం చేస్తారో కానీ జగన్ రెడ్డిని మళ్లీ కోలుకుకోుండా చేయడానికి ఈ కేసును ఉపయోగించుకోకపోతే చంద్రబాబు చేతకానితనం బయటపడినట్లేనన్నట్లుగా ఆర్కే పలుకులు ఉన్నాయి. ఓ రకంగా చంద్రబాబుకు గట్టి పరీక్ష పెడుతున్నారు. అదానీ వ్యవహారం కాబట్టి చంద్రబాబు జాగ్రత్తగా వ్యవహరిస్తారని అయితే.. చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇప్పుడు అదానీకి పవర్ సరఫరా చేసే పరిస్థితి లేదు కాబట్టి ఒప్పందాలను రద్దు చేసుకోవడం మంచిదంటున్నారు. మరి ఆర్కే అంచనాలను చంద్రబాబు అందుకుంటారా ?
https://www.telugu360.com/wp-content/uploads/2024/11/ABN-RK-1.jpg