ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలన్నీ వేట మొదలు పెట్టాయి. రిటైనర్స్ కాక మిగిలిన మిగిలిన కోటాలో ఆటగాళ్లను వేలంలో దక్కించుకోనున్నారు. ఈ సారి వేలాన్ని ఇండియాలో నిర్వహించడం లేదు. సౌదీ అరేబయాలో జెడ్డాలో నిర్వహిస్తున్నారు. 577 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లు , 210 మంది విదేశీ ఆటగాళ్లు. వీరిలో అత్యధిక మంది అన్ సోల్డ్ కేటగిరీలోనే ఉంటారు. ఎందుకంటే.. 204 మందిని మాత్రమే అన్ని టీములు కలిసి తమ జట్లలోకి తీసుకునే చాన్స్ ఉంది.
ఆటగాళ్లకు వెచ్చించాల్సిన సొమ్ము విషయంలోనూ నియంత్రణ ఉంది. రీటైనర్లకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించిన తర్వాత తమ దగ్గర ఉండే మిగిలిన సొమ్ము మేరకే ఆటగాళ్లకు పెట్టాల్సి ఉంటుంది. ఇలా చూస్తే పంజాబ్ కింగ్స్ కి మంచి వెసులుబాటు ఉంది. ఆ ఫ్రాంచైజీ ఆటగాళ్ల కోసం రూ.110.5 కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. మరే టీమ్‌కూ అంత వెసులుబాటు లేదు. ఎందుకంటే రీటైనర్స్ విషయంలో పంజాబ్ కింగ్ అసలు పంతాలకు పోలేదు. కేవలం ఇద్దరు ప్లేయర్స్ ను మాత్రమే అంటి పెట్టుకుంది.
ఇతర టీములు ఎక్కువ మంది ప్లేయర్లను రిటైనర్లుగా పెట్టుకోవడంతో వారికి సొమ్ము తక్కువగా ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రూ.83 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ లకు 73 కోట్లు , గుజరాత్ టైటాన్స్‌కు , లక్నో జెయింట్స్‌కు 69 కోట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. స్టార్ ప్లేయర్స్ కోసం వీరే పోటీ పడే అవకాశం ఉంది. అతి తక్కువగా రాజస్తాన్ రాయలసీమలోని వద్ద రూ. 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.45 కోట్లు పెట్టే చాన్స్ ఉంది.
పెద్దగా హైలెట్ కానీ అనూహ్యమైనా ప్లేయర్లకు అత్యధిక మొత్తం దక్కే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. రిషబ్ పంత్ ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు.