హైదరాబాద్ శివారులోని తన ఫామ్ హౌస్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎక్మామిడి గ్రామంలోఅలీకి ఫామ్ హౌస్ ఉంది. అందులో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నట్లుగా గుర్తించి స్థానికులు ఫిర్యాదులు చేశారు. దీంతో గ్రామ సెక్రటరీ శోభారాణి నోటీసులు జారీ చేశారు.
గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోరని ఫామ్ హౌస్లోకి ఎవరూ రారు అనుకుని అలీ నిర్మాణాలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.ల అయితే ఇటీవలి కాలంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చూసి చూడనట్లుగా ఉండే పరిస్థితి లేకుండా పోయింది. మామూలుగా శాశ్వత కట్టడాలు కాకపోతే ఎవరూ పట్టించుకోరు. కానీ అలీ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు.
అలీ తన లాయర్ ద్వారా సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంతోటి దాటికి లాయర్లు అవసరం లేదని.. అనుమతులుఉంటే చూపిస్తే సరిపోతుందని ఒక వేళ అనుమతులు లేకపోతే లాయర్లు కూడా ఏమీ చేయలేరని అంటున్నారు. సొంతంగా కూల్చి వేయడమో.. గ్రామ పంచాయతీ అధికారులు కూల్చివేసే వరకూ ఎదురు చూడటమో చేయాలంటున్నారు. ఇప్పుడు అనుమతుల అప్లయ్ చేసే అవకాశం ఉంటే చేసుకుంటే సరిపోతుంది.