మూడు సీజన్ల నుంచి ఫీజుు రీఎంబర్స్ మెంట్ ఇవ్వడం లేదని.. జగన్ రెడ్డి తెగ బాధపడిపోతూ ట్వీట్ పెట్టారు. సాక్షిలో రాయడం.. ముందూ వెనుకా ఆలోచించకుండా ఆయన ట్వీట్ పెట్టడం చూసి వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఐదునెలలు అయింది. ఇంజినీరింగ్ వంటి కాలేజీల్లో అడ్మిషన్లు జరిగి కాలేజీలు ప్రారంభమై రెండు నెలలు అయింది. అంటే ఇంకా ఫీజు రీఎంబర్స్ మెంట్ ప్రాసెస్ ఈ ఏడాదికి చేయాల్సిన సమయం దగ్గర పడలేదు.
కానీ జగన్ రెడ్డి మూడు త్రైమాసికలు అంటూ దీర్ఘాలు తీస్తూ ట్వీట్ పెట్టారు. అప్పుడు ఎవరు ఉన్నారో కాస్త ఆలోచించే ప్రయత్నం చేస్తే.. ట్వీట్ పెట్టకుండా ఆగేవారేమో. జగన్ రెడ్డి చెప్పిటనట్లుగా ఆయా త్రైమాసికులకు డబ్బులు రిలీఫ్ చేసినట్లుగా సాక్షిలో ప్రకటనలుఇచ్చుకున్నారు. కానీ వాస్తవంగా అకౌంట్లలో పడలేదు. కనీసం రూ. ఆరు వేల కోటల రూపాయలు తన నెత్తిపై అప్పు పెట్టి పోయారని లోకేష్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు ఏమనుకుంటారోనన్న కనీస ఇంగితం లేకుండా జగన్ రెడ్డి చేస్తున్న ట్వీట్లు ఆయన ఫ్రస్ట్రేషన్‌ను తెలియచేస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. అధికారంలో ఉండి అడ్డగోలుగా దోచుకున్న ఆయన .. తన అవినీతి వరుసగా బయటపడుతూంటే.. తన నిర్వాకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వాకాలు అన్నట్లుగా ట్వీట్లు పెట్టి.. విమర్శలు చేసి కవర్ చేసుకుంటున్నారు. కానీ ఆ బురద తన మీదే పడుతుందని గ్రహించలేకపోతున్నారు.