కబాలి… గత నెల రోజుల నుంచీ ఈ పేరే ట్రేడింగ్! అందరి నోటా కబాలీ మాటే. కబాలి పోస్టర్లు, పాటలు, డైలాగులు ఇవన్నీ రజనీ ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కబాలి గురించి ఏ న్యూస్ బయటకు వచ్చినా అది హాట్ టాపిక్ అయి కూర్చుంటోంది. ఇప్పుడు కబాలి పోస్టర్ గురించి చర్చ జరుగుతోంది. కబాలికి సంబంధించిన ఓ పోస్టర్‌పై కాపీ మరక పడింది. ఇర్ఫాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఆదారి పోస్టర్‌ని కబాలి టీమ్ కాపీ కొట్టినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. దీనిపై ఇర్ఫాన్ ఖాన్ కూడా స్పందించాడు. ”మా పోస్టర్‌ని వాళ్లు స్ఫూర్తిగా తీసుకొని ఉండొచ్చు. అయితే అదేం పెద్ద మేటరేం కాదు. మా సినిమా చూడండి.. వాళ్ల సినిమా కూడా చూడండి..” అంటూ ఇర్ఫాన్ లైట్ తీసుకొన్నాడు. ఇర్ఫాన్‌ది పెద్ద మనసే కావొచ్చు. కానీ సినీ విశ్లేషకులు మాత్రం.. పోస్టర్‌కి కూడా కాపీ కొట్టాలా?? అంటూ దర్శకుడు రంజిత్ పాపై విమర్శలు గుప్పిస్తున్నారు. పోస్టరే ఇలా ఉంటే.. సినిమా మాటేంటి? అంటూ అప్పుడే నాన్ రజనీ ఫ్యాన్స్ కబాలిపై నెగిటీవ్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. మరి దీనిపై కబాలి టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.