పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు ఎలా వ్యవహరించాలో జగన్ రెడ్డి చేసిన దిశానిర్దేశం సూటిగా ఉందని .. పార్లమెంట్లో బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకు మాట్లాడకుండా మద్దతిచ్చిరావాలని చెప్పారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు బీజేపీకి అత్యంత కీలకం. ఎందుకంటే వక్ఫ్ బిల్లుతో పాటు జమిలీ ఎన్నికల బిల్లులను కూడా ప్రవేశ పెట్టనుంది. ఇవే కాదు ఇంకా పలు బిల్లులు ఉన్నాయి.ఏ ఒక్క బిల్లును వ్యతిరేకించినా అతి రాజకీయంగా ఆత్మహత్య అవుతుందని జగన్కు క్లారిటీ ఉంది. అందుకే బయట ఎలాంటి ప్రకటనలు చేసినా లోపల మాత్రం మద్దతివ్వాలని సూటిగానే సూచించారని అంటున్నారు.
జగన్ రెడ్డి తన రాజకీయంలో ఓ క్లారిటీతో లేరు. టీడీపీ. జనసేనలతో కలిసి బీజేపీ తనను పాతాళంలోకి తొక్కేసినా ఆ పార్టీపై ఇంకా భయభక్తులు పోలేదు. ఉన్న స్థానం కూడా ఉంచకుండా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేస్తారేమోనని ఆయన కంగారు పడుతున్నారు. అందుకే రాజ్యసభ ఎంపీలను బీజేపీకి తాకట్టుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేస్తామని బహిరంగ ప్రకటనలు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు.
రాజ్యసభ ఎంపీల బలం ఇప్పటికీ కీలకమే. ఇంకా ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వీరితో బీజేపీ బిల్లులకు వ్యతిరేకంగా ఓట్లు వేయిస్తే… మోదీకి వ్యతిరేకంగా నిలబడిన వారు అవుతారు. కానీ అలా నిలబడితే జైల్లో కూర్చోవాల్సి వస్తుందని తెలుసు కాబట్టి…సైలెంటుగా అయిపోతున్నారు. రాజకీయంగా జగన్ రెడ్డి వెన్నుముక లేని తనాన్ని ఈ పార్లమెంట్ సమావేశాలు మరో సారి చూపించబోతున్నాయి.