స్కిల్ యూనివర్శిటీకి అదానీ ప్రభుత్వం ఇస్తామన్న రూ. వంద కోట్లు అవసరం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదానీ గ్రూపు ఫౌండేషన్ కు లేఖ రాసింది. చాలా రోజుల కిందటే అదానీ వచ్చి చెక్ ఇచ్చినప్పటికీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ప్రక్రియ పూర్తి కానందున ఇంకా ఆ వంద కోట్లు స్కిల్ ఖాతాలో జమ కాలేదు.తాజాగా ఆ ఎగ్జంప్షన్ లేఖ కూడా అందింది. అయినా ఆ వంద కోట్లు తమకు అవసరం లేదని ప్రభుత్వం తరపున జయేష్ రంజన్… అదానీ గ్రూపునకు లేఖ రాశారు.
అదానీ నుంచి డబ్బులు తీసుకుంటున్నారని అదే పనిగా ప్రచారం చేస్తున్నరాని రేవంత్ అన్నారు. అదానీ డబ్బు తెలంగాణకు అవసరం లేదని స్పష్టం చేశారు. అదానీ బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణలో ఎక్కువ కార్యకలాపాలు నిర్వహించారని పలు సంస్థలు పెట్టారని రేవంత్ రెడ్డి లిస్ట్ రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో వందల కోట్లు విలువైన పనులను అదానీ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఒక్క పరిశ్రమకూ అనుమతి ఇవ్వలేదన్నారు. అయితే ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ లేఖలను ఇచ్చారని తెలిపారు.
రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ,లాజిస్టిక్ పార్క్, అలాగే కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీకి EOఐ సమర్పించారన్నారు. చట్టబద్దంగా జరిగే టెండర్లలో ఎవరికి పనులు వస్తే వారు చేస్తారని దానికి ప్రభుత్వం చేసేదమీ ఉండదన్నారు. విరాళంగానే రూ. వంద కోట్లు అదానీ ఇస్తూంటే.. దాన్ని వివాదానికి ముడిపెట్టి విమర్శలు చేసి ఆ డబ్బును వద్దనుకునేలా చేసుకున్నారు.