కొడాలి నాని అడ్రస్ లేకుండాపోయారు కానీ ఆయన గుడివాడలో చేసిన దోపిడీ మాత్రం సాక్ష్యాలతో బయటకు వస్తోంది. తాజాగా ఆయన జగనన్న కాలనీలకు మెరక పేరుతో దోచేసిన వైనం వెలుగులోకి వచ్చింది.దీన్ని చూసి ఇలా కూడా దోచుకోవచ్చా అని విలిజెన్స్ అధికారులు ముక్కును వేలేసుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నేమ్ రోల్ కేసులు నమోదు చేసి చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది.
ప్రతి నియోజకవర్గంలో జగనన్న కాలనీల పేరుతో చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు. ఐదు లక్షలు విలువచేయని స్థలాలను ముఫ్పై లక్షలకుకొన్నారు. మళ్లీ వాటికి మెరక వేయాలని మట్టి తవ్వుకొచ్చారు. ఇలా ఒక దానిపై ఒకటి అవినీతి చేసుకుంటూ పోయారు. గుడివాడ నియోజకవర్గంలో అరకొర మెరక పోసి డబ్బులు కొట్టేసినట్లుగా తెలుస్తోంది. ఇదంతా కొడాలా కనుసన్నల్లోనే జరిగినట్లుగా విజిలెన్స్ ఆధారాలు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
కొడాలి నాని చేసిన అవినీతికి సంబంధించి చాలా విచారణలు గోప్యంగా జరుగుతున్నాయి. వాటిపై పక్కా ఆధారాలు సేకరించి అరెస్టులు చేయనున్నారు. రాజకీయాలకు ఆయనదూరంగా ఉన్నా…రాజకీయ సన్యాసం తీసుకున్నానని మీడియాకు లీకులు ఇచ్చినా ఆయనను వదిలి పెట్టే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు.