సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టమని ప్రోత్సహించిన వైసీపీ పెద్దలు ఇవాళ కనిపించడం లేదు. కేసులు పెట్టడం ప్రారంభమైన తర్వాత మీకు అండగా నేను ఉంటానని జగన్ రెడ్డి గంభీరమైన ప్రకటనలు చేశారు. ముందుగా తనను అరెస్టు చేయాలని సవాల్ చేశారు . అప్పటికే సగం మందిని అరెస్టు చేశారు. అయినా ఆయన ఏమీ తెలియదన్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రకటించిన వైసీపీ న్యాయవిభాగం కూడా అడ్రస్ లేకుండా పోయింది.
పెద్ద ఎత్తున సోషల్ మీడియా కార్యకర్తలు జైలుకెళ్లారు. వాళ్లకు బెయిల్ ఇచ్చే వారు కూడా లేకుండా పోయారు. పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అసలు కనిపించడం లేదు. పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ వస్తే ఫలానా వారిని పరామర్శించి వస్తున్నారు కానీ.. వారి కోసం రూపాయి ఖర్చు చేయమన్నా చేయడం లేదు. చేయమని చెబుతారు కానీ ఎవరికి అవసరం అన్నట్లుగా ఉంటున్నారు. వైసీపీ న్యాయవిభాగం లాయర్లు ఇక మాకు పనుల్లేవా అని సైలెంట్ గా ఉంటున్నారు.
ఎలాంటి సాయం అయినా తనను అడగాలని ఫోన్ నెంబర్ కూడా ఉదారంగా ఇచ్చిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఫోన్ అప్పటి నుంచి పోన్ చేయడం లేదు. మరీ పర్సనల్ నెంబర్ ఎవరైనా తెలుసుకుని ఫోన్ చేస్తే..వైసీపీ న్యాయవిభాగానికి ఫోన్ చేయమని అంటున్నారు. వైసీపీ క్యాడర్ ఇప్పుడు కేసుల ఒత్తిడిలో పార్టీ హైకమాండ్ కూడా పట్టించుకోకపోవడంపై నిరాశకు గురవుతున్నారు. జగన్ బెంగళూరు వెళ్లి తిరిగి రావడంలేదు.