మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలోనూ ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చేలా ఫలితాలు ఎవరికీ రాలేదు. అక్కడ మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో పది శాతం అంటే కనీసం29 అసెంబ్లీ సీట్లు తెచ్చుకున్న వారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా వస్తుంది. బీజేపీ కూటమిలో ఉన్న బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీలు అన్నింటికి అంత కంటే ఎక్కువే వచ్చాయి కానీ ఓడిపోయిన కూటమిలోని కాంగ్రెస్, శ్రరద్ పవార్, ఉద్దవ్ ధాక్రే పార్టీలకు కనీసం ఇరవై సీట్లు కూడా రాలేదు. అంటే ఎవరికీ ప్రతిపక్ష నేత హోదా లేనట్లే.
మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మూడు పార్టీలు కలిపి ఒకర్నే తమ నేతగా ఎన్నుకుంటే ప్రతిపక్ష నేత హోదా రావొచ్చు.కానీ అది సాధ్యమయ్యే అవకాశం లేదు. ఎ పార్టీకి ఆ పార్టీ పక్ష నేత ఉంటారు. మూడు పార్టీల్లో శివసేన పెద్దపార్టీగా ఉంది. ఆ పార్టీకి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీప్రధాన ప్రతిపక్ష నేత హోదా మాత్రం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
దేశంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేని రాష్ట్రాలు ఆరు వరకూ ఉన్నాయి. ఏపీలో జగన్ రెడ్డి ప్రతిపక్షే నేతే కానీ అసెంబ్లీలో గుర్తింపునకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు లేరు. దాంతో ఆయన తనకు హోదా ఇవ్వాలని రచ్చ చేస్తున్నారు. గుజరాత్‌లోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేదు. అక్కడ 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది కానీ.. కాంగ్రెస్‌కు 13 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు.
మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాల్లో అధికార కూటమి కాకుండా మరో పార్టీ పదిశాతం సీట్లు దక్కించుకోలేకపోయింది.