అక్కినేని ఇంటి నుంచి వరుసగా శుభవార్తలు అందుతూనే ఉన్నాయి. ఇటీవల నాగచైతన్య – శోభితలకు నిశ్చితార్థం జరిగింది. డిసెంబరు 5న వీరిద్దరి పెళ్లి జరగబోతోంది. ఈలోగా నాగార్జున మరో స్వీట్ న్యూస్ అభిమానులతో పంచుకొన్నారు. అఖిల్ కూడా త్వరలోనే ఓ ఇంటివాడవుతున్నాడని ప్రకటించారు. జైనాబ్ రవ్ డ్జీతో చైతూ నిశ్చితార్థం ఈరోజే సింపుల్ గా జరిగిపోయింది. ఆ ఫొటోల్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకొన్నారు. జైనాబ్ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషం గా ఉంది. యువ జంటను అభినందించండి. వారి ప్రేమ జీవితాంతం ఉండేలా అభిమానులు ఆశీర్వదించాలంటూ నాగ్ ఓ ట్వీట్ పెట్టారు. అయితే అఖిల్ పెళ్లెప్పుడన్నది చెప్పలేదు. ఈ డిసెంబరులో చైతూ పెళ్లి. సో.. 2025 ప్రధమార్థంలో అఖిల్ పెళ్లి జరిగే అవకాశం ఉంది.
ఎప్పుడైతే అఖిల్ నిశ్చితార్థం వార్త బయటకు వచ్చిందో అప్పుడే బైనాబ్ ఎవరు? అంటూ చిత్రసీమలో ఆసక్తికరమైన చర్చ మొదలైపోయింది. బైనాబ్ ముంబై వాసి. వాళ్ల కుటుంబం అక్కడే సెటిల్ అయ్యింది. బైనాబ్ కు చిత్రలేఖనంగా ప్రావీణ్యం ఉందని, ఓ మంచి ఆర్టిస్ట్ గా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకొందని తెలుస్తోంది. దేశ విదేశాల్లో ఎగ్జిబీషన్లు కూడా నిర్వహించిందట. అలా ఓ ఎగ్జిబిషన్లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా అఖిల్, బైనాబ్ పరిచయం అయ్యారని, వాళ్ల పరిచయం ప్రేమగా మారిందని, ఇరు కుటుంబాలూ వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని తెలుస్తోంది. నిశ్చితార్థం సింపుల్ గా చేసినా, పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరపాలని నాగ్ భావిస్తున్నారు.
చైతూ కెరీర్లో స్పీడుగా ఉన్నా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సమంతతో విడాకుల తరవాత కొంత డిస్ట్రబ్ అయ్యాడు. ఇప్పుడు రెండో పెళ్లితో చైతూ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఇక అఖిల్ కి కూడా ఇది వరకు నిశ్చితార్థం జరిగి, పెళ్లి ఓకే అనుకొనేలోగా కాన్సిల్ అయ్యింది. మరోవైపు కెరీర్లోనూ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నాడు. అఖిల్ ఓ ఇంటివాడైతే… తన కెరీర్ గాడిలో పడుతుందని నాగ్ భావిస్తున్నారు. ఇప్పుడు ఏకకాలంలో చైతూ, అఖిల్ ఇద్దరూ సెట్ అయిపోతున్నారు. నాగ్ కి అంతకంటే కావాల్సిందేముంది?