సుకుమార్ సినిమాలన్నీ లెంగ్తీగానే ఉంటాయి. ప్రతీ సీన్‌ని విడమరచి చెప్పడం ఆయనకు అలవాటు. అందుకే రన్ టైమ్ విషయంలో ఇష్యూ ఎదురవుతుంటుంది. ‘పుష్ప’ నిడివి 2 గంటల 59 నిమిషాలు. అంటే దాదాపు 3 గంటలు. సినిమాని కాస్త షార్ప్ చేయాల్సిందంటూ విడుదల సమయంలో కొన్ని కామెంట్లు వినిపించాయి. అయితే హిట్టయిన తరవాత పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు పుష్ప 2 రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలని తెలుస్తోంది. అంటే ‘పుష్ప’ కంటే 22 నిమిషాలు ఎక్కువ. ‘పుష్ప’ సమయంలోనే నిడివి తగ్గించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరి ఈసారి ఏమంటారో?
కానీ చిత్రబృందం మాత్రం నిడివి విషయంలో ఏమాత్రం బెంగ పెట్టుకోవడం లేదు. దానికి కారణం.. సినిమా బాటుంటే రన్ టైమ్ గురించి పెద్దగా పట్టించుకోరన్నది వాళ్ల నమ్మకం. ఈ యేడాది ప్రారంభంలో విడుదలైన యానిమల్ రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలు. సరిగ్గా… పుష్ప రన్ టైమ్ కూడా అంతే. యానిమల్ ఆడింది కదా, పుష్ప ఎందుకు ఆడకూడదు? అనే లాజిక్ సుకుమార్ దగ్గర ఉండే ఉంటుంది. ‘పుష్ప 2’లో చాలా పాత్రలకు కన్‌క్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు పుష్ప 3కి లీడ్ కూడా ఇవ్వాలి. యాక్షన్ సన్నివేశాలు చాలా సుదీర్ఘంగా సాగాయని, అందుకే రన్ టైమ్ పెరిగిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సెన్సార్‌కు ఇదే కట్ పంపిస్తారా, లేదంటే ఇంకొంచెం ట్రిమ్ చేసే అవకాశం ఉందా? అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సుకుమార్ అయితే తీసింది తీసినట్టు ప్రేక్షకులకు చూపించాలన్న పట్టుదలతో ఉన్నార్ట. ఆయన ఒక్కసారి డిసైడ్ అయితే.. అది జరిగి తీరుతుంది. కాబట్టి 3 గంటల 21 నిమిషాల సినిమానే ఫైనల్ అయ్యే ఛాన్సుంది. సినిమా బాగుండి, బన్నీ మానియా వర్కవుట్ అయితే… నిడివి సంబంధించిన కంప్లైంట్స్ ఏమీ ఉండవు. కాస్త అటూ ఇటుగా ఉన్నా, ముందు మాట్లాడేది రన్ టైమ్ గురించే.