పోలీసులు విచారణకు పిలిచారు. వారం రోజుల తర్వాత వస్తానన్నారు. వారం రోజుల తర్వాత మరో రెండు వారాల గడువు కావాలి అని లాయర్ తో లేఖ రాయించారు. ఫోన్లు స్విచ్చాఫ్ చేసి కనిపించకుండా పోయారు. అయినా ఓ వీడియో విడుదల చేసి రామ్ గోపాల్ వర్మ తనకు తెలిసిన చట్టం గురించి నీతులు చెబుతున్నారు. కేసులు ఎలా పెట్టాలి.. ఎలాంటి సెక్షన్లు ఉపయోగించాలి అని చెబుతున్నారు. ఇంకా ఏదేదో చెబుతున్నారు. అవన్నీ చాలా కాలంగా చెబుతున్నవే. ఇక్కడ సాంకేతిక పరమైన విషయం ఏమిటంటే.. చట్టాన్ని ఎందుకు ధిక్కరిస్తున్నావు ? పోలీసు వ్యవస్థను ఎందుకు తేలికగా తీసుకుంటున్నావు?
విచారణకు హాజరవుతానని చెప్పి కనిపించకుండా పోవడం పరరీ కావడమే. కేసులో బలం ఉందా లేదా అన్నది అరెస్టు చేస్తే కోర్టులో వాదించుకోవాలి. అరెస్టు చేయకపోతే పోలీసుల ముందు వాదించుకోవాలి. అంతే కానీ ఇలా వీడియోలు విడుదల చేస్తే దాన్ని మరింత రెచ్చగొట్టడం అంటారు. పోలీసులు పద్దతిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వ్యవహారం నోటీసుల దగ్గరే ఉంది. కానీ వైసీపీ హయాంలో పోలీసుల్లా వ్యవహరించాలంటే.. ఎఫ్ఐఆర్ కూడా అక్కర్లేదు. రాత్రికి రాత్రి ఎత్తేసి.. రఘురామను కొట్టినట్లుగా కొట్టి ..తర్వాత రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసేవాళ్లు. ఎందుకంటే ఈ ఆర్జీవీ అనే వ్యక్తి డబ్బులకు కక్కుర్తి పడి ఇతర వ్యక్తిత్వాన్ని హననం చేశాడు.
జగన్ రెడ్డి అధికారాన్ని చూసి ..ఆయన ఇచ్చిన డబ్బులను తీసుకుని ఇష్టం వచ్చినట్లుగా ఇతరులను కించ పరిస్తే.. సినిమాలు తీస్తే ఊరకుంటారా ?. వారికి అధికారం వచ్చిన తర్వాత సినిమా చూపించకుండా ఉంటారా ?. ఇప్పటికీ పవన్ కల్యాణ్ ..పోలీసుల తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఆయనను ఆయనకుటుంబాన్ని ఆర్జీవీని ఎంత కించ పరిచారో చెప్పాల్సిన పని లేదు. ఇతరుల్ని కించ పరచడం రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్చా కాదు. వారికీ ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఇప్పుడు అదే ఆర్జీవీకి కేసుల వల విసురుతోంది.
ప్రభుత్వం వద్ద కోటిన్నర డబ్బులు తీసుకున్నది కూడా నిజమే. తప్పుడు పనులు చేసి.. ఇతరులపై ఇష్టం వచ్చినట్లుగా వాగి డబ్బులు తీసుకోవడం వాక్ స్వేచ్చ కిందకు రాదు. ఘోరమైన నేరం కిందకు వస్తుంది. ఇలా ఎన్ని వీడియోలు చేసినా..పోలీసులు వదలరు సరి కదా..మరింత ఎక్కువగా ఇరుక్కుపోతారు.