జగన్ ఆనందం కోసం రఘురామకృష్ణరాజును పుట్టినరోజు నాడే సుమోటోగా రాజద్రోహం కేసు పెట్టి అరెస్టు చేసి తీసుకు వచ్చి చిత్ర హింసలు పెట్టిన పోలీసులకు.. ఇప్పుడు అసలు చిత్రహింసలు ఆ పోలీసుల అధికారులకు కనిపిస్తున్నాయి. రిటైరైపోయినా సీఐడీలో ఓఎస్డీగా వచ్చి .. అధికార దుర్వినియోగం చేసిన విజయ్ పాల్ అరెస్టయ్యారు. ఆయనకు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. ఆయన పాత్రధారి మాత్రమే. అసలు సూత్రధారులు ఇక నుంచి బయటకు రానున్నారు.
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తో పాటు అసలు జగన్ రెడ్డి కూడా ఈ కేసులో కీలకం. విజయ్ పాల్ స్టేట్ మెంట్ అక్కర్లేదు.. ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటే.. వీరందర్నీ అరెస్టు చేయాల్సి ఉంటుంది. అసలు రాజద్రోహం కేసు పెట్టాల్సిన అవసరం ఏమిటో కూడా తేలుస్తారు. ఓ ఎంపీని ఎలా కొట్టారు..ఎందుకు కొట్టారు.. అరెస్టు సమయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదో అంతా బయట పెడతారు.
రఘురామ తమను ధిక్కరించినందుకు జగన్ రెడ్డి వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి కొట్టించారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్లు ఇప్పుడు ఆ టార్చర్ అనుభవించబోతున్నారు. సీఐడీ నుంచి.. గుంటూరు జీజీహెచ్ ఇంచార్జ్ గా ఉన్న వైసీపీ నేత భార్య వరకూ అందూ కేసుల పాలవుతున్నారు. వీరికి అసలు టార్చర్ ముందు ముందు ఉంటుంది. తప్పుడు పనులు చేస్తే పరిస్థితి ఇలా ఉంటుందా అని.. తెలిసేలా వారు లైఫ్ లాంగ్ బాధపడేలా వ్యవహారం ఉంటుందన్నది సెటైర్లు వినిపిస్తున్నాయి.