బీఆర్ఎస్ హయాంలో అదానీకి తాము రెడ్ సిగ్నల్ చూపిస్తే రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారని అదే తేడా అని కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి ఘనంగా ప్రకటించుకున్నారు. అందుకు సాక్ష్యంగా ఒకటి రెండు సందర్భాల్లో మీడియాలో వచ్చిన వార్తలను చూపించారు. నిజానికి ఆయన చూపించాల్సింది వేరే ఉంది. తమ హయాంలో అదానీకి గ్రూపు ఒక్క పైసా పెట్టుబడులు పెట్టలేదని వాదించాల్సి ఉంది. కానీ ఆ మాట మాత్రం ఆయన చెప్పలేదు. ఎందుకంటే తెలంగాణలో పదేళ్లలో అదానీకి గ్రూపు పెట్టుబడులు చాలా పెట్టింది. ప్రభుత్వం అందుకు సహకరించింది కూడా.
బీఆర్ఎస్ హయాంలో అదానీ కి రెడ్ కార్పెట్
2020-21లో యాదాద్రిలో పరమపూజ్య సోలారు ఎనర్జీ పేరుతో పెట్టుబడులకు ఆమోదం తెలిపారు . రామన్నపేట దగ్గర ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం అందించారు. ఇరవై ఐదు మెగావాట్ల మినీ హైడల్ ప్రాజెక్టు ఇది. ఇది అదానీ సబ్సిడరీ. రూ. 746 కోట్లు పెట్టుబడిగా ప్రభుత్వమే ప్రకటించింది. తర్వాత అదే కంపెనీతో వంద మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం చేసుకుంది. అది కూడా పాతికేళ్ల పాటు. అదే సమయంలో అదానీకి గ్రూపు కంపెనీ అయిన ఆర్ఈజీఎల్ తో 110 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాన్ని చేసుకున్నారు. అంటే పరమపూజ్య పేరుతో సోలార్ పవర్ ప్లాంట్లే కాదు.. ఇతర విద్యుత్ ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
శంషాబాద్ దగ్గర ఏరో స్పేస్ కంపెనీకి పలు రకాల ప్రయోజనాలు
అదానీకి చెందిన ఏరోస్పేస్ పార్క్ ను శంషాబాద్ దగ్గర ఏర్పాటు చేశారు. ఈ పార్క్ కోసం యూఏవీ ఫెసిలిటీ కల్పించారు. దీని వల్ల అదానీ ఏరో స్పేస్ పార్క్‌కు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇవే కాకుండా బీఆర్ఎస్ హయాంలో పలు పెట్టుబడుల ప్రతిపాదనలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూల చర్చలు జరిపింది. అవన్నీ బహిరంగ రహస్యమే.
ఇవేమీ తప్పు కాదు..తెలంగాణకు మేలు !
అదాని గ్రూపు పెట్టుబడులు పెట్టినంత మాత్రాన దోచేయడం అని అనుకోలేం. కానీ కేటీఆర్ అదే విధంగా ముద్ర వేస్తున్నారు. తమ హయాంలో అసలు అదానీని అడుగు పెట్టనీయలేదని అంటున్నారు.ఇప్పుడు ఆయన లాజిస్టిక్ పార్క్ , సిమెంట్ ఫ్యాక్టరీలు పెడుతున్నారు కాబట్టి అది దోపిడీనే అని అంటున్నారు. అలా ముద్ర వేయడానికి తాము అసలు అదానీని అడుగు పెట్టనీయలేదని అంటున్నారు. కానీ అదానీకి పెట్టుబడుల వల్ల తెలంగాణకు మేలే జరుగుతుంది. అందులో అవినీతి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. కానీ తాము అ పెట్టుబడులపై అవినీతి ముద్ర వేస్తున్నాం కాబట్టి..తమ హయాంలో అసలు పెట్టుబడులు రాలేదని చెప్పడం వ్యూహాత్మకతప్పిదమే. కేటీఆర్ అదే చేస్తున్నారు.
EXPOSED: The Close Nexus Between Adani Group and BRS in Telangana
మీడియాలో నిన్న కేటీఆర్ : " అదానీని మేము ( TRS Government) ఏ రోజూ ఎంకరేజ్ చెయ్యలేదు. తెలంగాణలో అదానీకి ఎంట్రీ లేదని బరాబర్ చెప్పినం . "
Telugu360 Fact Check:
👉The TRS government awarded a 100 MW power… pic.twitter.com/QyL2zr2T1S
— Telugu360 (@Telugu360) November 27, 2024