చుట్టూ గోడ పెట్టి గేటు పెట్టుకుంటే అదే గేటెడ్ కమ్యూనిటీ. కానీ ఆ గేటెడ్ కమ్యూనిటిలో అనేక రకాలు ఉంటాయి. ఇందులో ఎప్పటికప్పుడు కొత్త కొత్త లగ్జరీలు వచ్చి చేరుతున్నాయి. కొన్నాళ్ల కిందటి వరకు అపార్టుమెంట్ కాంప్లెక్సుల్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటే చాలనుకునేవారు. తర్వాత వేడుకలు చేసుకోవడానికి ఓ ఏర్పాటు ఉండాలనుకున్నారు. ఇప్పుడు మెల్లగా అది గోల్ఫ్ టర్ఫ్ల వరకూ వెళ్తోంది. గేటెడ్ కమ్యూనిటీలపై ప్రజలు ఆసక్తి చూపిస్తూండటంతో బిల్డర్లు కొత్తకొత్త సౌకర్యాలు కల్పిస్తూ వెళ్తున్నారు.
చాల వరకూ లగ్జరీ గేటెడ్ విల్లాస్ ఉన్న ప్రాజెక్టుల్లో క్లబ్ హౌస్ ఉంటుంది. ఓ స్విమ్మింగ్ ఫూల్ ఉంటుంది. వాకింగ్ ట్రాక్ కొన్ని చోట్ల ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేస్తున్న గేటెడ్ కమ్యూనిటీల్లో క్రికెట్ పిచ్.. గోల్ఫ్ టర్ప్ వంటివి ప్లాన్ చేస్తున్నారు. స్కైవాక్లుకూడా పెడతామని అంటున్నారు. ఇటీవల శంషాబాద్ లో లాంచ్అయిన ఓ ప్రాజెక్టులో ఇలాంటివన్నీ కల్పిస్తామని అంటున్నారు. ఇవేమీ అపార్టుమెంట్లు కాదు.. లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాలే.
హైరైజ్ అపార్టుమెంట్ల వైపు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారని బిల్డర్లు భావిస్తున్నారు. అందుకే అసలు భవనం కన్నా లగ్జరీస్ కల్పించడానికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇంట్లో నుంచి అత్యవసర సమయాల్లో తప్ప ఇతర సమయాల్లో బయటకు రాకుండా గడిపేలా సౌకర్యాలు కోరుకుంటున్నారు. బిల్డర్లు వారి ఆలోచనలకు తగ్గట్లుగానే వ్యవహరిస్తున్నారు.