అదానీ దగ్గర లంచం తీసుకున్నట్లుగా బయటపడిన రోజున హడావుడిగా తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లిపోయిన జగన్ రెడ్డి తన పత్రికలో.. అసలు అదానీతో డీల్ లేదని కేంద్రంతోనే ఒప్పందం చేసుకున్నామని రోజుకు మూడు నాలుగు పేజీలు రాయిస్తున్నారు.కానీ జనానికి ఓ క్లారిటీ ఉంది. మరీ అంత పిచ్చి వాళ్లం కాదని అనుకునేవారు ఎక్కువ మంది ఉన్నారు. తన మీడియా,సోషల్ మీడియాతో చేయించే పని చేయిస్తూనే ఈ వ్యవహారం గురించి బయటపడేందుకు జగన్ రెడ్డి అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారు.
లంచం డబ్బులు ఏ ఏ రూపంలోకి వచ్చాయన్నదానిపై ఇప్పటికే స్పష్టమైన సమాచారం కేంద్రానికి కూడా ఉండే ఉంటుంది. దర్యాప్తు చేయిస్తే ఎక్కడ దొరికిపోయే చాన్స్ ఉందో న్యాయనిపుణులతో చర్చించి.. వాటి నుంచి ఎలా బయటపడాలా అన్న అంశంపై మేథోమథనం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అదానికి చెందిన వారు కూడా జగన్ తో టచ్ లోకి వచ్చారని అంటున్నారు. ఈ అంశాన్ని ఎలా డీల్ చేయాలో.. ఇందులో ఉన్న వారంతా కమ్యూనికేట్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
జగన్ రెడ్డికి పార్టీని నడుపుకోవడం కన్నా.. ఇలా తన వ్యక్తిగత అవినీతి వ్యవహారాల్లో తదుపరి ఏం చేయాలన్నదానిపై వ్యూహాలు పన్నడానికే ఎక్కువ సమయం పడుతోంది. ఓ వైపు పార్టీ నేతలంతా ఆయన హయాంలో చేసిన నిర్వాకాల కారణంగా కేసుల పాలవుతున్నారు. వారిని కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు. జగన్ రెడ్డినే తనను తాను కాపాడుకోవడానికి కిందా మీదా పడుతున్నారని .మిగతా వారి గురించి పట్టించుకునే పరిస్థితి లేదని అంటున్నారు.