అమెరికాలో తమపై నమోదైన కేసుల విషయంలో అదానీ గ్రూపు కీలక ప్రకటన చేసింది. అమెరికాలో తనపై నమోదు అయింది లంచం కేసులు కాదని స్పష్టం చేస్తూ అటు సెబీకి, ఇటు మీడియాకు లేఖలు పంపింది. అయితే ఈ లెటర్ల సారాంశం అసలు కేసులు నమోదు కాలేదని కాదు. కానీ నమోదైన కేసులు లంచం కేసులు అని ప్రచారం జరుగుతోందని ఆ కేసులు కేవలం మోసాల సెక్షన్లకు సంబంధించినవని అదాని గ్రూపు చెబుతోంది.
అమెరికా ఫారిన్ కరప్ట్ ప్రాక్టిసెస్ యాక్ట్ కింద కేసులు పెట్టినట్లుగా చెబుతున్నారని ఆ చట్టం కింద కేసులు పెట్టలేదని ఆదాని గ్రూపు తెలిపింది. సెక్యూరిటీస్ ఫ్రాడ్ కన్స్పైరసి, ప్రాడ్ కన్స్పైరసి, సెక్యూరిటీ ఫ్రాడ్ అనే మూడు ఆరోపణలు చేశారని తెలిపింది. ఇందులో లంచాల ప్రస్తావన లేదన్నారు.
అదాని లంచాలు ఇండియాలో ఇచ్చి అక్కడ అవినీతి చేసి అమెరికా నుంచి పెట్టుబడులు అక్రమంగా సంపాదించడం కోసం అక్కడ మ్యానిప్యులేషన్ చేశారని అమెరికా కోర్టుకేసు పెట్టింది. లంచాలు ఆయన అమెరికాలో ఇవ్వలేదు కాబట్టి అక్కడ కేసు అయ్యే అవకాశం లేదు. పూర్తిగా అమెరికాలో స్టాక్ ఎక్సేంజ్ కు సంబంధించిన కేసులోనే ఆయన నిందితుడు. ఈ కేసులో ఆయన రాజీ చేసుకోవడానికి అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇండియాలో ఆయన లంచాలు ఇచ్చిన వాటిపై కేసులు పెట్టవచ్చు. విచారణ చేయవచ్చు. కానీ కేంద్రం కానీ నాలుగురాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ దిశగా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. తాము అదానీతో ఎలాంటి డీల్స్ పెట్టుకోలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే అని చెబుతున్నారు.