పుష్ప 2 చెన్నై ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. స్టేజ్ పైనే మైత్రీ మేకర్స్ కి నా మీద ప్రేమకన్నా కంప్లయింట్స్ ఎక్కువయ్యాయని చెప్పడం చర్చనీయంశమైయింది. క్రెడిట్స్, రెమ్యునరేషన్ ఏదైనా సరే మననే అడిగి తీసుకోవాల్సి, ఎవరు ఇవ్వరని దేవి కాస్త స్వరం పెంచి మాట్లాడటం చర్చకు దారి తీసింది. దేవి చేసిన కామెంట్స్ లో నేపధ్యంలో చాలా కథనాలు పుట్టుకొచ్చాయి. దేవికి, మైత్రీకి గ్యాప్ వచ్చిందని, ఇకపై మైత్రీ, దేవి కాంబినేషన్ వుండదనే కోణంలో గాసిప్స్ పుట్టుకొచ్చాయి.
ఇవాళ జరిగిన రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో ఈ టాపిక్ వచ్చింది. నిర్మాత రవి ఈ అంశంపై మాట్లాడారు. ‘దేవిశ్రీ ప్రసాద్ మాటల్లో మాకేం తప్పు కనిపించలేదు. లవ్ వున్న చోటే కంప్లయింట్స్ వుంటాయి. ఆయన మాటల్లో వేరే ఉద్దేశం లేదు. మీడియాలో రకరకాలుగా కథనాలు వచ్చాయి. వాటిలో వాస్తవం లేదు. భవిష్యత్తులో దేవితో పని చేస్తూనే వుంటాం. మా జర్నీ కొనసాగుతుంది’ అని క్లారిటీ ఇచ్చారు. మొత్తనికి నిర్మాత మాటలతో ఈ వివాదానికి శుభం కార్డు పడింది.