ఇక్కడ అల్లు అర్జున్.. మలయాళంలో మల్లు అర్జున్ అయిపోయాడు. ఆర్య సినిమా నుంచీ… బన్నీకి అక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఏ తెలుగు హీరోకీ దక్కనంత క్రేజ్ మలయాళంలో బన్నీ సొంతం చేసుకొన్నాడు. తెలుగులో అరకొర ఆడిన సినిమాలు సైతం కేరళలో దుమ్ము దులిపేవి. ఆ ప్రేమ పుష్ప 1పైనా చూపించారు. మల్లూ ఫ్యాన్స్ అంటే బన్నీకి కూడా ప్రత్యేకమైన అభిమానం. తన ప్రేమని ఇప్పుడు తిరిగి చూపించే అవకాశం దక్కింది.
పుష్ప 2లో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ పాట పూర్తిగా మలయాళంలోనే ఉంటుంది. పుష్పని ఆరు భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రతీ భాషలోనూ మలయాళం వెర్షనే ఉంటుంది. అది.. బన్నీకి మలయాళ అభిమానులకు ఇస్తున్న కానుక. `ఫీలింగ్స్` పేరుతో దేవిశ్రీ కంపోజ్ చేసిన ఈ పాట.. మాస్కు బాగా నచ్చుతుందని టాక్. ఈ పాటలో బన్నీ, రష్మిక వేసే స్టెప్పులు కూడా స్పెషల్ గా ఉండబోతున్నాయి. ఈ విషయాన్ని కేరళ వేడుకలో అల్లు అర్జున్ స్వయంగా చెప్పాడు. పుష్ప 1లో స్టెప్పులు వేసే అవకాశం పెద్దగా రాలేదని, వింటేజ్ బన్నీని మిస్ అవుతున్నాం అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారని, అందుకే ఫీలింగ్స్ పాటలో స్టెప్పులు వేసి ఆ కొరత తీర్చామని అంటున్నాడు బన్నీ. ఈ పాటలో అల్లు అర్జున్ స్టెప్పులు కంటే…. రష్మిక వేసిన స్టెప్పులే సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాయట. మరి ఆ పాట ఎలా ఉంటుందో, అందులో డాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో తెలియాలంటే డిసెంబరు 5 వరకూ ఆగాలి.