రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్‌కు గురి చేసిన కేసులో సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఆయనను కొట్టారని సీఐడీ గార్డులు వాంగ్మూలం ఇచ్చారు. కేసు నమోదు చేయడానికి ముందే అరెస్టు కోసం పోలీసులు హైదరాబాద్ వెళ్లారని స్పష్టమయింది. అసలు లేని కేసులో మీడియాతో మాట్లాడుతున్నారని చెప్పి కేసులు పెట్టడమే పెద్ద కుట్ర. మొత్తంగా ఈ కుట్రను చేధించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.
విజయ్ పాల్ రిమాండ్ రిపోర్టు చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. పోలీసులతో వ్యవస్థీకృత నేరం చేయించడం ఇంత సులువా.. చట్టం చేతులు చిన్నవని ఆ వ్యవస్థలో ఉన్న వారే ఎందుకు అనుకున్నారు?. అత్యంత తీవ్రమైన నేర మనస్థత్వంలో ఉన్న ఓ ప్రభుత్వ పెద్ద తమను కూడా నిండా ముంచుతున్నారని.. చివరికి ఆయనకేం కాదని..తామే నష్టపోతామని ఎందుకు ఊహించలేకపోయారు?. ఒక్క రఘురామ కేసులోనే కాదు.. ఎంతో మంది అధికారుల జీవితం తప్పుడు పనులకు బలి కానుంది.
పీఎస్ఆర్ ఆంజనేయలు అనే ఐపీఎస్ నుంచి కొల్లి రఘురామిరెడ్డి అనే ఐపీఎస్ వరకూ ఎంతో మంది ఓ సైకో మనస్థత్వం ఉన్న లీడర్ ను మెప్పించేందుకు చట్టాలు అతిక్రమించి.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తప్పులు చేశారు. వారు చేసింది చిన్న చిన్న తప్పులు కాదు. జగన్ రెడ్డిని గుడ్డిగా నమ్మి జీవితాన్ని నట్టేట ముంచుకున్నారు. సర్వీసులో ఉంటారా… బయటకు పోతారా అన్నది కాదు. వారిశేష జీవితం మొత్తం అవి వెంటాడతాయి.
ట్రైనింగ్‌లో ఏం నేర్చుకున్నారో.. తమ ఇరవై, ముఫ్పైఏళ్ల సర్వీసులో ఏం నేర్చుకున్నారో కానీ ఓ సైకో మనస్థత్వం ఉన్న నేత చేతిలో మాత్రం ఇలా బలైపోయారు. ఇది వారి స్వయంకృతమే.